Indian Independence Movement-26

TSStudies

శాసన ఉల్లంఘన ఉద్యమం తాత్మాలికంగా విరమించడుట

సైమన్‌ సలహా మేరకు బ్రిటన్‌లోని జేమ్స్‌ పాలెస్‌లో మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరిగాయి.

మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం(1930 నవంబర్‌ - డిసెంబర్‌)
ఈ సమావేశంలో పాల్గొన్నవారు
1. ముస్లిం లీగ్‌ - మవామ్మద్‌ అలీ, మవామ్మద్‌ షఫీ, ఆగాఖాన్‌, ఫజల్‌ ఉల్‌ హక్‌, మహ్మద్‌ అలీ జిన్నా
2. హిందూ మహాసభ - మూంజే, యన్‌.సి కేల్కర్‌ జయకర్‌
3. లిబరల్స్‌ పార్టీ - శ్రీనివాన చింతామణి, తేజ్‌ బహదూర్‌ సహ్రూ
4. బడుగు వర్గాలు బి.ఆర్‌ అంబేద్కర్ ‌
5. సంస్థానాలు -అక్బర్‌ హైదరీ (హైదరాబాద్‌ ప్రధాని), ఇస్మాయిల్‌ (మైసూర్‌ ప్రధాని)
ఐ.యన్‌.ని మొదటి రౌండ్  టేబుల్‌ సమావేశాన్ని
బపాష్కరించింది. దీనితో మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం విఫలమైంది.
రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఐ.యన్‌.సి తప్పనిసరిగా పాల్గొనాలని బ్రిటిష్‌ ప్రధాని రామ్సే మెక్‌ డొనాల్డ్‌ గవర్నర్‌ జనరల్‌ ఇర్విన్‌పై ఒత్తిడిచేశాడు.
దీనితో 1931 మార్చి 5న గాంధీ
మరియు ఇర్విన్‌ మద్య ఢిల్లీలో ఒక ఒడంబడిక జరిగింది. దీనినే “ఢిల్లీ ఒడంబడిక” అంటారు. (ఇర్విన్‌-గాంధీ ఒడంబడిక). ఎం.ఎ. అన్సారీ, జయకర్‌ల మధ్యవర్తిత్వం.

ఢిల్లీ ఒడంబడికలోని ప్రధాన అంశాలు
1. గాంధీ తన శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేసి రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరవుతారు.
2. దీనికి బదులుగా బ్రిటిష్‌వారు శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో అరెస్ట్‌ అయిన వారందరినీ విడుదలచేస్తారు. జప్తు చేసిన ఆస్థూలు కూడా తిరిగి ఇవ్వబడుతాయి.
గాంధీ-ఇర్విన్‌ లేదా ఢిల్లీ ఒడంబడిక ప్రకారం గాంధీ తన శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి 1931 నవంబర్‌, డిసెంబర్‌లలో జరిగిన రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలలో పాల్గొన్నాడు.

రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశం(1931 నవంబర్‌, డిసెంబర్‌)
ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అంబేద్కర్‌, సరోజనీ నాయుడు, మహమ్మద్‌ ఇక్బాల్  తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో బడుగు వర్గాల వారి రిజర్వేషన్లకు సంబంధించి విభేదాలు ఏర్పడుట కారణంగా ఇది విఫలమైంది.

శాసన ఉల్లంఘన ఉద్యమం పునఃప్రారంభం
రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశం విఫలమయిన తర్వాత 1932 జనవరిలో గాంధీ బ్రిటన్‌ నుండి ఇండియాకు తిరిగివచ్చాడు.
దీనితో గాంధీని అరెస్ట్‌ చేసి 'పూనే'లోని ఎరవాడ జైలుకు తరలించారు.
శాసన ఉల్లంఘన ఉద్యమం రెండవ దశలో చెప్పుకోదగ్గ సంఘటనలు చోటుచేసుకోలేదు.
1932 ఆగస్టులో బ్రిటిష్‌ ప్రధాని రామ్సే మెక్‌ డొనాల్డ్‌ కమ్యూనల్‌ అవార్డును ప్రకటించాడు.
దీని ప్రకారం ఇండియాలోని ప్రజలు వివిధ గ్రూపులుగా విభజించబడ్డారు.
హిందూ మతం అగ్రవర్ణాలు, బడుగు వర్గాలుగా విభజించబడింది.
ప్రతి గ్రూపుకు ప్రత్యేక ఎలక్టోరేట్‌ కల్పించబడింది.
బడుగువర్గాల వారికి కూడా ప్రత్యేక ఎలక్టోరేట్‌ కల్పించబడింది.
తక్షణమే దీనిని ఖండిస్తూ గాంధీ ఎరవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు.
కమ్యూనల్‌ అవార్డును బి.ఆర్‌ అంబేద్కర్‌ స్వాగతించాడు.
గాంధీ నిరాహార దీక్ష కారణంగా కమ్యూనల్‌ అవార్డ్‌ విరమించబడుతుందేమోనని అంబేద్కర్‌ ఆందోళనకు గురయ్యాడు.
Ts Studies,TSstudies,TS Study Circle,indian history notes in telugu,indian history study material in telugu, indian history notes in telugu pdf,TSPSC indian history notes in telugu,tspsc group 2 study material in telugu,indian national movement in telugu,india freedom struggle notes in telugu,india national movement notes in telugu,india national movement study material in telugu,Indian history in telugu UPSC,Indian independence movement in telugu,Summary of Indian National Movement in telugu,Indian independence movement notes in telugu,Indian independence movement study material in telugu,Nationalist Movements in India,The New Nationalist Movement in India,Indian Freedom Movement notes in telugu,Indian Freedom Movement notes in telugu,Indian Freedom Movement study material in telugu,national movement for freedom in india,freedom struggle of india notes in telugu,freedom struggle of india study material in telugu,Gloroots of India's freedom struggle notes in telugu,Role of women in India's freedom struggle,Indian Freedom Struggle 1857 to 1947,Swadeshi Movement in India,Alluri Sitarama Raju Era notes in telugu,Alluri Sitarama Raju Era Study material in telugu,role of Alluri Sitarama Raju in indian freedom,role of Alluri Sitarama Raju in indian independence,Alluri Sitarama Raju role in south africa,Alluri Sitarama Raju books,Alluri Sitarama Raju quotes,Alluri Sitarama Raju political teacher,Which period of Indian history is known as the Alluri Sitarama Raju Era,Start of the Alluri Sitarama Rajuan Era,introudction to the Alluri Sitarama Raju era,Chronology of Alluri Sitarama Raju,Beginning of the Alluri Sitarama Rajuan Era,The Legacy of Alluri Sitarama Rajuan Era,Alluri Sitarama Raju role in independence,How Alluri Sitarama Raju shaped our Independence,Alluri Sitarama Raju role in Freedom struggle,What role did Alluri Sitarama Raju play in our Freedom,
దీనితో గాంధీ, అంబేద్కర్‌ల మధ్య మదన్‌ మోహన్  మాలవ్య మధ్యవర్తిత్వం చేశాడు. దీని ఫలితమే పూనా ఒడంబడిక.
గాంధీ, అంబేద్కర్‌ల మద్య జరిగిన పూనా ఒడంబడిక ప్రకారం బడుగు వర్గాల ప్రత్యేక ఎలక్టోరేట్‌కు బదులు ద్వంద్వ ప్రాతినిధ్యం / ఎలక్టార్  ప్రవేశపెట్టబడింది.
గతంలో బడుగువర్గాలవారికి కేటాయించిన 74 సీట్లు 148కి 'పెంచబడ్డాయి.

మూడవ రౌండ్  టేబుల్‌ సమావేశం(1932 నవంబర్‌)
కేవలం 416 మంది ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు.
మూడవ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సైమన్‌ కమిషన్‌ నివేదిక చర్చించబడింది. దీని ఆధారంగా 1935 చట్టానికి తుది రూపాన్ని ఇచ్చారు.
అంబేద్కర్‌ మరియు జిన్నాలు మూడవ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలలో పాల్గొన్నారు.
రెండవ దశలోని శానన ఉల్లంఘన ఉద్యమం భారతదేశంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేదు.