నెహ్రూ రిపోర్ట్-1928:
సైమన్ కమిషన్ బ్రిటన్‌కు తిరిగి వెళ్లిపోయి భారతదేశంలోని పరిస్థితులను అప్పటి బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్
“బిర్కెన్‌హెడ్”కు వివరించింది.
దీనితో ఐ.యన్.సి యే ఒక రాజ్యాంగాన్ని రూపొందించాలని, దానిని ప్రతి ఒక్క భారతీయుడు అంగీకరించాలని పేర్కొంటూ బిర్మెన్ హెడ్ ఐ.యన్.సికి ఒక సవాలు విసిరాడు.
దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ఐ.యన్.సి మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలో భారత రాజ్యాంగ సూత్రాలను రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటుచేసింది.
సుభాష్ చంద్రబోస్, తేజ్ బహదూర్ సప్రూ, జయకర్ కట్జూ మొదలగువారి సహాయం పొంది మోతీలాల్ నెహ్రూ తన నివేదికను రూపొందించి ఐ.యన్.సికి సమర్పించాడు. దీనినే 'నెహ్రూ రిపోర్ట్' అని పేర్కొంటారు.
1928 డిసెంబర్‌లో కలకత్తా ఐ.యన్.సిలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన నెహ్రూ రిపోర్ట్ చర్చించబడింది.
నెహ్రూ రిపోర్ట్‌లో ప్రధాన అంశాలు:
1) స్వపరిపాలన
2) కేంద్రీకృత ప్రభుత్వం
3) వయోజన ఓటు హక్కు
4) హిందువులు, ముస్లింలు మైనారిటీలుగా ఉన్న ప్రాంతాలలో వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు
5) జాయింట్ ఎలెక్టోరేట్ సిస్టమ్
నెహ్రూ రిపోర్ట్ ఆధారంగా ఐ.యన్.సి బ్రిటిష్ వారికి క్రింది అల్టిమేటంను జారీచేసింది.
'ఒక సంవత్సరంలోపు భారతదేశానికి స్వపరిపాలన కల్పించాలి'.
జిన్నా 14 పాయింట్ ఫార్ములా (14 Point Formula )ను ఢిల్లీ నుంచి 1929లో ప్రకటించాడు.
దీనిలోని ముఖ్య అంశాలు
1) సమాఖ్య ప్రభుత్వం
2) ప్రత్యేక ఎలక్టోరేట్ (Separate Electorate)
3) భవిష్యత్తులో ఏర్పడే ప్రభుత్వాలలో 1/3వ వంతు ముస్లింలు ఉండాలి.
4) సివిల్ సర్వీసెస్‌లో 1/3 వంతు ముస్లింలు ఉండాలి.
5) బోంబే ప్రెసిడెన్సీ నుంచి సింధ్‌ను వేరు చేసి ఒక రాష్ట్రంగా ప్రకటించాలి.
జిన్నాయొక్క14 సూత్రాలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తిరస్కరించింది.
1929:
దీపావళి డిక్లరేషన్‌ను గవర్నర్ జనరల్ ఇర్విన్ ప్రకటించాడు. దీని ప్రకారం భారతదేశానికి స్వపరిపాలన, నెమ్మదిగా సహజసిద్ధంగా లభ్యమవుతుంది.
లాహోర్ ఐ.యన్.సి సమావేశం (1929)
జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్ ఐ.యన్.సి సమావేశం జరిగింది.
స్వపరిపాలనకు సంబంధించి బ్రిటిష్ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో 1929 డిసెంబర్ 31న ఐ.యన్.సి మూడు తీర్మానాలను చేసింది.
1) పూర్ణ స్వరాజ్
2) ప్రతి సంవత్సరం జనవరి 26ను స్వాతంత్ర్య దినంగా జరుపుట (1930 జనవరి 26న మొదటి స్వాతంత్ర్యదినం జరుపబడింది)
3) శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించుట