గదర్ పార్టీ:
గదర్ అనగా విప్లవం.
దీనిని 1913లో లాలాహర్‌దయాళ్, సోహాన్‌సింగ్ బక్నా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థాపించారు.
దీని మొట్టమొదటి అధ్యక్షుడు - సోహన్‌సింగ్ బక్నా
దీని అసలు పేరు హింద్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా. దీని యొక్క పత్రిక - గదర్
గదర్ పత్రిక గురుముఖి, ఉర్దూ భాషలలో ప్రచురణ అయ్యేది.
గదర్ పత్రిక నినాదం “అంగ్రేజీ రాజ్‌క దుష్మన్”
1914లో బాబా గుర్దిత్ సింగ్ కొంతమంది భారతీయులను గదర్ పార్టీలో చేర్చించుటకై కోమగటమారు అనే
నౌకను ఆగ్నేయ ఆసియా నుంచి లీజుకు పొందాడు.
కోమగటమారు నౌకలోని ఉద్యమకారులందరినీ కెనడా పోలీసులు వాంకోవర్ వద్ద (ఉత్తర అమెరికా ఖండం) ఆరెస్ట్ చేసి తిరిగి భారత్‌కు పంపారు.
కలకత్తా దగ్గర బడ్జ్ బడ్జ్ అనే ప్రాంతమునకు ఈ నౌక చేరుకుంది.
అమెరికా మొదటి ప్రపంచ యుద్దంలో పాల్గొన్న తర్వాత గదర్ పార్టీ కార్యకలాపాలను 1918లో అణచివేసినది (హిందూ కుట్ర ద్వారా).
గదర్ పార్టీలో చేరిన తెలుగువాడు -దర్శి చెంచయ్య
కాబూల్ కుట్ర (1915):
బర్కతుల్లా, ఒబైతుల్లాఖాన్, మహేంద్ర ప్రతాప్ కాబూల్‌లో భారతదేశ తాత్కాలిక ప్రభుత్వమును ఏర్పాటు చేశారు.
మౌలానా ఒబైదుల్లా:
ఈయన సిక్కు మతం నుంచి మారి ముస్లిం అయ్యాడు. తన అధ్యాపకుడు మహమ్మద్ అల్‌హసన్ సలహాపై 'జమియత్ ఉల్ అన్సార్'” అనే సంస్థ స్థాపించాడు.
విప్లవ చరిత్రలో 'సిల్క్ లేఖల' రచయితగా ఈయనకు గుర్తింపు.
బర్కతుల్లా:
ఇస్లామ్ ఫ్రెటర్నిటీ (Islam Fraternity) అనే పత్రికను ప్రచురించాడు.
జర్మనీలో 'నయా ఇస్లాం' అనే పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు.
బర్కతుల్లాఖాన్ భవివ్యత్తు భారత ప్రధానిగా ప్రకటించబడ్దాడు.
వామపక్షాలు :
వీరి ప్రధాన లక్ష్యము - ఆర్థిక సాంఘిక సమానత్వమును తీసుకురావడం.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వామపక్షాల భావాల కొరకు ప్రయత్నించారు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెలుపల సీపీఐ సభ్యులు, ముజాఫర్ అహ్మద్, ఆసిఫ్ హుస్సేన్ హస్వి మొదలగువారు వామపక్షాల భావాల కొరకు పోరాటం చేశారు.