అంబేద్కర్ :(14-4-1891 - 6-12-1956)

ఇతను 1913లో ఎల్ఫీన్‌స్టోన్ కాలేజీ నుండి పట్టభద్రుడ య్యాడు.
బరోదా గైక్వాడ్ సహాయంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో పి. హెచ్.డి పూర్తి చేశాడు.
కొల్హాపూర్ షాహు మహరాజు సహాయంతో లండన్ విశ్వవిద్యాలయంలో బార్ ఎట్ లాను పూర్తి చేశాడు.
అంబేద్కర్ పత్రికలు -మూక్‌నాయక్, బహిష్కృత్ భారత్
అంబేద్కర్ The Evils of Caste అనే పుస్తకాన్ని రచించాడు.
అంబేద్కర్ వెనకబడిన తరగతుల వారి అభివృద్ధి కోసం “బహిష్కృత్ హితకారిణి సభను", అఖిల భారత బడుగువర్గాల ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు.
అంబేద్కర్ ఇండిపెండెంట్ ఇండియన్ లేబర్ పార్టీని ఏర్పాటు చేసి వెనకబడిన వర్గాల వారి రాజకీయ హక్కుల కోసం పోరాటం చేశాడు.
గాంధీ వెనకబడిన వర్గాల వారి కోనం మొట్టమొదటిసారిగా 'హరిజన్'(దేవుని బిడ్డలు) అనే పదాన్ని ఉపయోగించాడు.
గాంధీ 1983లో వెనకబడిన వర్గాల వారి అభివృద్ధి కోసం హరిజన్ సభను ఏర్పాటు చేశాడు.
గాంధీ 'హరిజన్' అనే వార్తాపత్రిక ద్వారా భారతదేశంలో ఉన్న అంటరానితనంను దూరం చేయుటకు ప్రయత్నించాడు.
1932 పూనా ఒడంబడిక ద్వారా వెనకబడిన వర్గాల వారికి ఎక్కువ నియోజకవర్గాలు కేటాయించబడేటట్లు చేశాడు.
“బోలే తీర్మానం” ప్రకారం అన్ని బహిరంగ ప్రాంతాల్లో నిమ్న కులాలవారికి అనుమతి ఇవ్వబడింది.
కేరళ :
కేరళలో నిమ్నకులాల అభివృద్ధి కోసం పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి - శ్రీనారాయణగురు
ఇతను ఎజవా తెగకు చెందినవాడు
నారాయణగురు అట్టడుగు వర్గానికి చెందినవాడు.
1880 సం॥లో 'అరవైపురం' దేవాలయంలో తానే విగ్రహ ప్రతిష్ట చేసి ఉద్యమాన్ని ప్రారంభించాడు.
అగ్రకులాల వారి ఆధిపత్యంను ఖండిస్తూ జాతి మీమాంస వ్యాసంను రాశాడు.
శ్రీనారాయణగురు ధర్మ పరిపాలన యోగంను ఏర్పాటుచేశాడు. దీని ద్వారా కేరళలో వెనకబడిన వారి కోసం అనేక దేవాలయాలను నిర్మించాడు.
ఇతను ఈ విధంగా పేర్కొన్నాడు “మానవాళికి ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే కులం ఉంటుంది”
శ్రీనారాయణగురు శిష్యుడు సహాధరన్ అయ్యప్పన్ ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు -'మానవాళికి దేవుడు, మతం, కులం ఉండదు'.
శ్రీనారాయణగురు యొక్క అనుచరులను నియో బుద్ధిస్టులు అంటారు.