గాంధీ దళితుల ఉద్ధరణ కొరకు పోరాటం
1933-34లలో గాంధీ ప్రధానంగా దళితుల ఉద్ధరణ కొరకు కృషి చేశారు. భారతదేశ అనేక ప్రాంతాల్లో పర్యటించి కుల వివక్షతను ఖండిస్తూ దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశాడు.
దళితులను హరిజనులు అనగా దేవుని బిడ్డలు అని పేర్కోన్నాడు.
దళిత ఉద్ధరణ కొరకు హరిజన్ అనే పత్రికను ప్రచురించి స్వయంగా సంపాదకీయం చేశాడు.
ఆలిండియా డిప్రెస్‌డ్ క్లాస్ అసోసియేషన్‌ను దళితులకొరకు స్థాపించాడు.
1933లో ఆంధ్రాలో పర్యటించి కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాలోగల సిద్ధాంతం అనే గ్రామంలో ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని చేపట్టాడు.
1934లో హైదరాబాద్‌లో పర్యటించి కుల వివక్షతను ఖండించాడు.
శాసన ఉల్లంఘన ఉద్యమం విరమించబడిన తరువాత ఆవిర్భవించిన సోషలిస్ట్ లేదా కమ్యూనిస్ట్ పార్టీలు
కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ(సి.ఎస్.పి) - 1934
దీనిని 1934లో ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, మిన్నూ మాసానీలు బొంబాయిలో స్థాపించారు.
మొదటి కార్యదర్శి = ఆచార్య నరేంద్ర. దేవ్
సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి - తెన్నేటి విశ్వనాథం
సి.ఎస్.పి క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో కీలకపాత్ర పోషించింది.
ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ(ఎ.ఎస్.పి) - 1934
దీనిని 1934లో యన్.జి రంగా విజయవాడలో స్థాపించాడు.
ఆంధ్రా సోషలిన్ట్ పార్టీ మొదటి అధ్యక్షుడు -యన్.జిరంగా.
ఆంధ్రా సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి - మద్దూరి అన్నపూర్ణయ్య
తరువాత కాలంలో ఎ.ఎస్.పి కమ్యూనిస్టుల వశం అయింది.
మద్దూరి అన్నపూర్ణయ్య - కాంగ్రెస్ పత్రిక
మద్దూరి అన్నపూర్ణయ్య 1940లో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన “ఫార్వర్డ్ బ్లాక్” పార్టీలో చేరిన మొదటి తెలుగువాడు.
ఆంధ్ర స్వరాజ్య పార్టీ - గాడిచర్ల
ఐ.యన్.సి ప్రభుత్వం (1937-39)
1935 చట్టం ప్రకారం 1937లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారతదేశంలోని మతతత్వపార్టీలు ఘోరపరాజయాన్ని చవిచూశాయి.
ముస్లిం లీగ్ మరియు హిందూ మహాసభ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాయి.
దీనితో ఈ రెండు పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి మతతత్వాన్ని ప్రోత్సపించాయి.
1938లో వి.డి సావర్కర్ హిందూ మహాసభకు అధ్యక్షుడై హిందూ రాష్ట్రం అనే సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశాడు. జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు.
అప్పుడు భారతదేశంలో మొత్తం 11 గవర్నర్ ప్రావిన్సెస్ / రాష్ట్రాలు ఉండేవి.
ఈ ఎన్నికలలో ఐ.యన్.సి 8 రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా, ఒక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం, మిగిలిన రెండు రాష్ట్రాలలో ఐ.యన్.సియేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
సంకీర్ణ ప్రభుత్వం - సింధ్ - అల్లాభక్షి సిఎం
భారత జాతీయ కాంగ్రెసేతర ప్రభుత్వాలు
1. బెంగాల్ - ఫజల్-ఉల్-హక్(ఇతను ప్రజా క్రిషక్ పార్టీకి చెందినవాడు)
2. పంజాబ్ - హయత్‌ఖాన్( ఇతను యూనియనిస్ట్ పార్టీకి చెందినవాడు)
భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాలు
1. మద్రాస్ ప్రెసిడెన్సీ
2. బాంబే ప్రెసిడెన్సీ
3. సెంట్రల్ ప్రావిన్స్
4. యునైటెడ్ ప్రావిన్స్
5. బీహార్
6. ఒరిస్సా
7. అస్సాం
8. వాయువ్య సరిహద్దు ప్రాంతం
మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయ్యాడు.
1939 సెప్టెంబర్‌లో జర్మన్ హిట్లర్ పోలాండ్‌పై దాడి చేశాడు. తక్షణమే బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది.
దీనితో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అయింది.
భారత జాతీయ కాంగ్రెస్ ను సంప్రదించకుండా అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ లిన్‌లిత్‌గో భారతదేశం కూడా రెండవ ప్రపంచ యుధ్ధంలో పాల్గొంటుందని ప్రకటన చేశాడు.
తక్షణమే భారత జాతీయ కాంగ్రెస్ దీనిని ఖండిస్తూ నిరసనగా తన ఎనిమిది రాష్ట్రాలలోని ప్రభుత్వాలకు రాజీనామా చేసింది.
ఐ.యన్.సి తన ప్రభుత్వాలకు రాజీనామా చేయడంతో ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా దీన్ని ఒక విముక్తి లేదా డెలివరెన్స్‌గా పరిగణించాడు.
ఈ సందర్భంగా 1939 డిసెంబర్ 22న డే ఆఫ్ డెలివరెన్స్ నిర్వహించారు.
బొంబాయిలో జిన్నాతోపాటు బి.ఆర్ అంబేద్కర్ ఈ డే ఆఫ్ డెలివరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.