సైమన్ కమిషన్
1923 ఎన్నికలలో స్వరాజ్య పార్టీ జాతీయస్థాయిలో 40శాతం సీట్లతో కేంద్ర చట్టసభలోకి ప్రవేశించింది.
కేంద్ర చట్టసభకు సభాధ్యక్షుడు - విఠల్‌ఖాయ్ పటేల్
1919 చట్టాన్ని తక్షణమే పునఃసమీక్షించి భారతీయులకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని స్వరాజ్య పార్టీ డిమాండ్ చేసింది.
దీనితో 1924లో బ్రిటన్‌లోని లేబర్ పార్టీ ప్రభుత్వం 'ముద్దిమాన్ కమిటీని ఏర్పాటుచేసి ఇండియాకు పంపింది.
'ముద్దిమాన్ కమిటీ భారతదేశంలో 1919 చట్టాన్ని సమీక్షిస్తున్నపుడు బ్రిటన్‌లోని లేబర్ పార్టీ ప్రభుత్వం కూలిపోయి కన్సర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వం
ముద్దిమాన్ కమిటీని వెనక్కి పిలిచి అనేక సంవత్సరాల కాలయాపన తరువాత, 1927 నవంబర్‌లో 7 మంది ఆంగ్లేయులతో సైమన్ కమిషన్(1+-6)ను ఏర్పాటుచేసింది.
సైమన్ కమిషన్‌లో ఏడుగురు కూడా ఆంగ్రేయులే ఉ౦డడంతో దానిని White Commission అంటారు.
సైమన్ కమిషన్‌కు పూర్తి చట్టబద్ధత కారణంగా దీనిని ఇండియన్ స్టాచ్యుటరీ కమిషన్ (చట్టబద్ధ) అని కూడా అంటారు.
జస్టిస్ పార్టీ, యూనియనిస్ట్ పార్టీ మినహాయించి ఇండియాలో అన్ని పార్టీలు సైమన్ కమిషన్‌ను బహిష్మరించాయి.
1927 డిసెంబర్‌లో సైమన్ కమిషన్‌ను బహిష్కరిస్తూ
సైమన్ గో బ్యాక్ ఉద్యమాలను చేపట్టాలని ఐ.యన్.సి ఎం.ఎ అన్సారీ అధ్యక్షతన మద్రాస్‌లో తీర్మానించింది. (సైమన్ కమిషన్‌లో ఒక్క భారతీయుడికి కూడా స్థానం కల్పించకపోవడం కారణంగా)
1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ ఇండియాకు చేరుకుంది.
బాంబేలో ఉద్యమకారులు నల్లజెండాలతో స్వాగతం పలికి సైమన్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు.
ఫిబ్రవరి 3న అనేక ప్రాంతాలలో సైమన్ గో బ్యాక్ ఉద్యమాలు చేపట్టబడ్డాయి.
జాతీయస్థాయిలో సైమన్ గో బ్యాక్ ఉద్యమాల తీవ్రత క్రింది ప్రాంతాలలో ప్రధానంగా కనిపించింది.
1. మద్రాస్ - టంగుటూరి ప్రకాశం
2 లక్నో - జవహర్‌లాల్ నెహ్రూ, జి.బి పంత్
3. లాహోర్ - లాలాలజపతిరాయ్
ఫిబ్రవరి 3న కాశీనాధుని నాగేశ్వరరావు మద్రాసులో ఒక సభను నిర్వహించి సైమన్ గో బ్యాక్ ఉద్యమాలలో పాల్గొనాలని పిలుపు ఇచ్చాడు.
సైమన్ కమిషన్‌ను బహిష్కరించాల్సందిగా రుక్ష్మిణి లక్ష్మీపతి మహిళలకు పిలుపునిచ్చింది
గుంటూరులో నడింపల్లి నరసింహారావు సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని చేపట్టాడు. ఇతన్ని గుంటూరు కేసరి అంటారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌లో అప్పటి విజయవాడ మున్సివల్ చైర్మన్ అయిన అయ్యదేవర కాళేశ్వరరావు సైమన్ గో బ్యాక్ అని రాసి ఉన్న ఉత్తరాన్ని సైమన్‌కు అందజేశాడు.
టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసులోని ప్యారిస్ కార్నర్ వద్ద సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని చేపట్టినపుడు పోలీస్ కాల్పులలో పార్ధసారథి అనే వ్యక్తి మరణించాడు.
పార్ధసారథి శవం వద్దకు వేగంగా వెళుతున్న టంగుటూరి ప్రకాశంను పోలీసులు తుపాకీతో బెదిరించి అడ్డుకున్నారు.
తక్షణమే టంగుటూరి తన ఛాతీని చూపించి దమ్ముంటే కాల్చండి అని సవాలు విసిరాడు. ఈ ధైర్యసాహసానికిగాను టంగుటూరికి 'ఆంధ్రకేసరి/షేర్-ఇ-ఆంధ్ర' అనే బిరుదు ఇవ్వబడింది.