Indian Independence Movement-22

TSStudies
స్వరాజ్య పార్టీ
Aims of Swaraj Party,Brief History of Swaraj Party in telugu,The Swaraj Party was organised by,Birth of Swaraj Party,Non Cooperation Movement & Swaraj Party,who formed the swaraj party,Swaraj Party and Gandhi,Swaraj Party history,history of Swaraj Party,founder of Swaraj Party,Swaraj Party founder,
1922 డిసెంబర్‌లో ఐ.యన్‌.సి వార్షిక సమావేశం సి.ఆర్‌ దాస్‌ అధ్యతన గయలో జరిగింది.
ఈ సమావేశంలో సి.ఆర్‌.దాస్‌ కౌన్సిల్‌ ఎంట్రీ (Wreck with in) తీర్మానమును ప్రవేశపెట్టాడు.
కానీ గాంధీ వ్యతిరేకించడంతో ఈ తీర్మానం తిరస్కరించబడింది.
దీనితో సి.ఆర్‌ దాస్,‌ మోతీలాల్‌ నెహ్రూ, విఠల్‌బాయ్‌ పటేల్‌లు స్వరాజ్య పార్టీని స్థాపిస్తున్నట్లు గయలో 1922 డిసెంబర్‌ 31న ప్రకటించారు.
అప్పుడు సి.ఆర్‌ దాస్‌ అధ్యక్షుడిగా ఎన్నికకాగా, మోతీలాల్‌ నెహ్రూ కార్యదర్శి అయ్యాడు.
1924లో 'గంజాం'లోని ఒక సభలో 'మహర్షి' బులుసు సాంబమూర్తి భారతదేశంలోనే మొట్టమొదటిగా పూర్ణ స్వరాజ్‌ తీర్మానం చేశాడు.
1924 డిసెంబర్‌లో బెల్లాంలో గాంధీ అధ్యక్షతన ఐ.యన్‌.సి సమావేశంలో కౌన్సిల్‌ ఎంట్రీ తీర్మానం ఆమోదించబడింది.
దీనితో స్వరాజ్య పార్టీ కార్యకలాపాలు ఐ.యన్‌.సిలో విలీనమయ్యాయి.
1927:
All India States People Conference ను 1927లో బల్వంతరాయ్‌ మెహతా, జి.ఆర్‌. అభ్యాంకర్‌, మాణిక్‌లాల్‌ కొఠారీలు స్థాపించారు.
సంస్థానాలలో పాలకులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలను ఏకం చేసి కలసికట్టుగా పోరాటం చేయడం వీరి యొక్క ముఖ్య ఉద్దేశం.
1939లో జవహర్‌లాల్‌ నెహ్రూ దీనికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు.

బార్దోలి ఉద్యమం (1928):
Bardoli Satyagraha,Bardoli Satyagraha notes in telugu,indian history Bardoli Satyagraha study material in telugu,sardar vallabai patel Bardoli Satyagraha,When did Bardoli Satyagraha took place,Bardoli Satyagraha year,the bardoli satyagraha of 1928,Bardoli Satyagraha: Useful Notes,Useful Notes on Bardoli Satyagraha of 1928,గుజరాత్‌లోని బార్దోలి ప్రాంతంలో 1928లో పంటలకు సరైన గిట్టుబాటు ధర లభ్యం కాలేదు.  అదే సమయంలో బ్రిటీష్‌ వారు పన్నును 22% పెంచారు.
దీని కారణంగా పట్టీదార్‌ యువక్‌ మండలి సభ్యులు కల్యాణ్‌జీ మెహతా, కున్వర్‌జీ మెహతా బ్రిటీష్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టారు.
తర్వాత వల్లబాయ్‌ పటేల్‌ ఈ ఉద్యమానికి నేతృత్వం వహించాడు.
అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో నినాదం అయిన 'No Taxation without Representation' అనే నినాదమును వ్యాప్తి చేశాడు.
దీనికి భయపడిన బ్రిటీష్‌ వారు మాక్స్‌వెల్డ్‌ బ్రూమ్‌ ఫీల్డ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటీషు ప్రభుత్వం శిస్తు వసూలును ఆపివేయడానికి నిర్ణయించింది.
అప్పుడే వల్లబాయ్‌ పటేల్‌కు సర్దార్  అనే బిరుదు ఇవ్వబడింది. (గాంధీ లేదా బార్దోలి లోని మహిళలు ఈ బిరుదు ఇచ్చారని పేర్కొంటారు)
వల్లబాయ్‌ పటేల్‌ను 'లెనిన్‌ ఆఫ్‌ బార్దోలి అని కూడా అంటారు.