సింధ్ ఆక్రమణ (1843)(British Occupation of Sindh) :
గవర్నర్ జనరల్ -ఎలెన్‌బరో
సింధ్‌ను బెలుచిస్తాన్‌కు చెందిన తల్పూరా అనే తెగ పాలించింది.
సింధ్ అనేక ప్రాంతాలుగా విభజించబడి ఉండేది. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క గిరిజన నాయకుడు పాలించేవాడు. ఈ నాయకుడిని అమీర్ అనేవారు.
1889లో సింధ్ అమీర్‌లు బ్రిటీష్ వారితో సైనిక సహకార ఒప్పందమును కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సింధ్ సరిహద్దు ప్రాంతాలకు బ్రిటీష్ రక్షణ కల్పించింది.
1843లో రష్యా భారతదేశంపై సింధ్ మీదుగా దాడిచేసే అవకాశం ఉందని భావించి సింధ్‌ను ఆక్రమించుటకు బ్రిటీష్ వారు నిర్ణయించారు.
అప్పటి గవర్నర్ జనరల్ ఎలెన్‌ఐబరో సింధ్ ఆక్రమణ కొరకై చార్లెస్ నేపియర్ అనే జనరల్‌ను పంపాడు.
1848లో అతి సునాయసముగా చార్లెస్ నేపియర్ సింధ్ అమీర్‌లను ఓడించి సింధ్‌ను ఆక్రమించాడు.
నేపియర్ ఈ క్రింది సందేశాన్ని ఎలెన్‌బరోకు పంపాడు.
"I have sin(ne)d"
పంజాబ్ ఆక్రమణ(లేదా) అంగ్లో సిక్కు యుద్దాలు:
సిక్కు మతాన్ని స్థాపించినది - గురునానక్
సిక్కు మతంలో మొత్తం 10 మంది సిక్కు గురువులు ఉన్నారు.
నానక్ (1469-1538):
ఇతని సంగీత వాయిద్యం - రబాబ్
ఇతని ప్రధాన శిష్యుడు - మదన
అంగధ్ (1538-52):
ఇతను గురుముఖి లిపిని వ్యాప్తి చేశాడు. (పంజాబీ భాష)
మొగల్ చక్రవర్తి హుమాయూన్ ఇతనిని సందర్శించాడు.
అమర్‌దాస్ (1552-74):
ఇతను మొదట్లో విష్ణు భక్తుడు
సరీసహగమనమును, పరదా విధానమును, మత్తు పానీయాలు సేవించడాన్ని ఖండించాడు.
రామ్‌దాస్ (1574-81):
ఇతను రామ్‌దాస్‌పురా(అమృత్‌సర్)ను నిర్మించాడు
అమృత్‌సర్‌లో స్వర్ణ దేవాలయ నిర్మాణానికి అక్బర్ భూమిని రామ్‌దాసుకు ఇచ్చాడు.
అర్జున్‌దేవ్ (1581-1606):
ఇతను స్వర్ణ దేవాలయమును నిర్మించాడు.
సిక్కుల పవిత్ర గ్రంథము అయిన ఆదిగ్రంథ్ లేదా గురుగ్రంథ్ సాహెబ్‌ను రచించాడు.
ప్రతి సిక్కు తన సంపాదనలో 1/10వ వంతు సిక్కు గురువులకు ఇవ్వాలని పేర్కొన్నాడు. దీనినే మన్సద్ అంటారు.
ఇతను జహంగీర్‌చే చంపబడ్డాడు.
హరిగోవింద్(1606-44):
ఇతని కాలం నుండే సిక్కులు మొగలులకు వ్యతిరేకంగా ఆయుధాలను చేపట్టారు.
ప్రతీ సిక్కుతన సంపాదనలో కొంత భాగంతో గుర్రాలను, ఆయుధాలను కొనుగోలు చేసి సిక్కుగురువుకు ఇవ్వాలని పేర్కొన్నాడు.
ఇతను ప్రధాన కేంద్రాన్ని అమృత్‌సర్ నుండి కిరాత్‌పూర్‌కు మార్చాడు.
హర్‌రాయ్ (1644-61):
ఇతను బెరంగజేబు ఆస్థానాన్ని సందర్శించాడు.
హరికిషన్ (1661-64):
ఇతను అతి చిన్న వయస్సులో(5 సం॥లు) సిక్కు గురువు అయ్యాడు.
మశూచీ వ్యాధితో బెరంగజేబు ఆస్థానంలోనే మరణించాడు.
తేజ్ బహదూర్ (1664-75):
ఇతను బెరంగజేబుచే చంపబడ్డాడు.
గురుగోవింద్ (1675-1708):
తన ప్రధాన కేంద్రాన్ని ఆనందపూర్ వద్ద ఏర్పాటు చేశాడు.
ఇతను 1699లో ఖల్సాను (ఆనంద్‌సాహెబ్ వధ్ద) ఏర్పాటు చేశాడు. ఇది మొగలులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం ఏర్పాటు చేయబడిన సైనిక దళం. ఖల్సాలో చేరినవారు తప్పనిసరిగా 5K లను పాటించాలి.
K -కిర్పన్ - ఖడ్గం
K -కేశ్ - జుట్టు
K -కంగీ - దువ్వెన
K -కర - కడియం
K -కచ్చ.. - అంతర తొడుగు
గురుగోబింద్ ఔరంగ జేబుకు రాసిన చివరి ఉత్తరాన్ని జాఫర్ అంటారు.
ఇతని గుర్రం పేరు- దిల్‌బాగ్ (ఆఖానీలా ఘోడా)
ఇతను ఆదిగ్రంథ్‌ను 11వ సిక్కు గురువుగా పేర్కొని, దానికి గురుగ్రంథ్ సాహెబ్ అని పేరు పెట్టాడు.
1708లో మహారాష్ట్రలో గోదావరి నది ఒడ్డున నాందేడ్ వద్ద సర్‌హింద్ మొఘల్ అధికారి వజీర్‌ఖాన్ ఆదేశాల మేరకు జంషెడ్‌ఖాన్ మరియు వాసిల్‌బేగ్ గురుగోవింద్‌ను హత్య చేశారు.
ఇతని మరణానంతరం ఇతని శిష్యుడు బందా బహదూర్ లేదా (లచ్చమన్‌దాస్) సిక్కులకు నేతృత్వం వహించాడు.
బందా బహదూర్ :
ఇతన్ని గురు భక్ష్‌సింగ్ అని కూడా అంటారు.
ఇతను తనకు తాను సచ్చాబాదుషాగా ప్రకటించుకున్నాడు.
సిక్కుమతాన్ని పాటించేవారిని సింగ్(సింహ్)గా పిలవాలని పేర్కొన్నాడు.
ఫత్‌దరాస్ (విజయం కలుగుగాక) అనే పలకరింపును ప్రవేశపెట్టాడు.
1716 లో మొగలు చక్రవర్తి ఫారుఖ్ సియార్ కాలంలో చంపబద్దాడు. (ఫారుక్ సియర్ జనరల్ అబ్దుస్ సమద్‌ఖాన్ ఇతన్ని చంపాడు)
ఇతని మరణానంతరం సిక్కులు 12 తెగలు లేదా శాఖలు(మీజిల్స్)గా విడిపోయారు.
ఉదా: సుఖర్‌చాకియా, బంగి, నఖాయి, దాలేవాలియ, ఆహ్లువాలియా, నిషాన్‌వాలా, నిహాంగ్, షహీద్ మొదలగునవి
ఈ తెగలలో అతి ముఖ్యమైనది సుఖర్‌చాకియా.
దీనిని స్థాపించినది- చరత్‌సింగ్.
సుఖర్‌చాకియాలో అతి ముఖ్యమైనవాడు మహరాజా రంజిత్‌సింగ్
మహఠాజా రంజిత్‌సింగ్ :
బిరుదులు :
- మహరాజ
-సిక్కు రాజ్య నిర్మాత
- One Eyed Giant
ఇతని అతిముఖ్యమైన మంత్రులు - 1) దివాన్ దీనానాథ్ 2) అజీజుద్దీన్
ఇతను కోహినూర్ వజ్రాన్ని ఆఫ్ఘన్ పాలకుడు “షాషుజా” నుంచి సేకరించాడు.
ఇతను అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయానికి బంగారుపూతను వేయించాడు.
లాహోర్‌లో ఆధునిక ఆయుధ కార్మాగారాన్ని నిర్మించాడు.
1799 - రంజిత్‌సింగ్ లాహోర్‌ను ఆక్రమించి తన రాజకీయ రాజధానిగా ప్రకటించాడు.
1802 - అమృత్‌సర్‌ని ఆక్రమించి తన మత రాజధానిగా ప్రకటించాడు.
1809 - బ్రిటీష్ గవర్నర్ జనరల్ 1వ మింటోతో అమృత్‌సర్ ఒప్పందమును కుదుర్చుకున్నాడు. (ఈ ఒప్పందం ప్రకారం సట్లెజ్ నది బ్రిటీష్ మరియు పంజాబ్ మధ్య సరిహద్దుగా మారింది)
1831 - బ్రిటీష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్‌తో సింధూనావికా ఒప్పందంను కుదర్చుకున్నాడు. (దీని ప్రకారం ఆంగ్లేయులు వర్తకం కోసం సింధూనదిని ఉపయోగించుకోవచ్చు)
1838 - త్రైపాక్షిక ఒవృందం (రంజిత్‌సింగ్, బ్రిటీష్, ఆఫ్ఘన్ పాలకుడు షాషుజా). ఈ ఒప్పందం ప్రకారం రంజిత్
సింగ్ ఆఫ్ఘనిస్థాన్‌లో షాషుజాకు వ్యతిరేకంగా ఉన్న తిరుగుబాట్లను అణిచివేశాడు.
1839- రంజిత్‌సింగ్ మరణించాడు. ఇతని మరణానంతరం ఖరక్, షేర్ మొదలగు బలహీన పాలకులు పంజాబును పాలించారు.
1843- రంజిత్‌సింగ్ చిన్న కుమారుడు దిలీప్‌సింగ్ పంజాబ్ పాలకుడు అయ్యాడు. ఇతని సంరక్షకురాలు రాణి జిందాన్(తల్లి).