గాంధీ యుగం (1920-47) :
తండ్రిపేరు - కరంచంద్
తల్లిపేరు - పుత్లిబాయ్(కరంచంద్ యొక్క 4వ భార్య)
గాంధీ రాజ్‌కోట్‌లో ఆల్‌ఫ్రెడ్ హై స్కూల్, భావనగర్‌లో సమర్‌దాస్ కాలేజిలో చదువుకున్నాడు.
1888లో తన 13వ యేట 14 సంవత్సరాల కస్తూర్భా మఖాంజీని వివాహామాడాడు.
1888లో లండన్‌కు వెళ్లి యూసిఎల్ యూనివర్శిటీలోని లా ఇన్నర్ టెంపుల్‌లో 'లా'ను పూర్తి చేసి 1891 జూన్‌లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.
గాంధీ కుమారులు -
హరిలాల్(1888)
మణిలాల్(1892)
రాందాస్ (1897)
దేవదాస్ (1900)
1948 జనవరి 30న ఢిల్లీలో హత్యకు గురయ్యాడు.
బిరుదులు:
- జాతిపిత (సుభాష్ చంద్రబోస్ ఇచ్చాడు)
- మహాత్మ (రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చాడు)
- బాపూజీ (జవహర్‌లాల్ నెహ్రూ ఇచ్చాడు)
- కైజర్-ఇ-హింద్(హిందుస్తాన్ చక్రవర్తి) (బ్రిటీష్ వారు ఇచ్చారు)
- హిందూదేశ సింహం అనికూడా అంటారు.
వార్తా పత్రికలు:
- Young India
- హరిజన్
- నవజీవన్
- Indian Opinion (దక్షిణాఫ్రికాలో)
పుస్తకాలు:
- The Story of My Experiments (గుజరాత్‌భాషలో రాశాడు)
- Conquest of Self
- Hind Swaraj
సంస్థలు:
- సబర్మతి (గుజరాత్), వార్ధా, నివేదిత ఆశ్రమాలు (మహారాష్ట్ర)
- All India Spinners Association
- All India Depressed Class Association
దక్షిణాఫ్రికాలో గాంధీ ఉద్యమం:

దర్బన్ నుండి జోహన్‌బర్ల్ .
మీదుగా ప్రిటోరియో (ప్రస్తుతం ష్వానే) వెళ్లుటకు
ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించుకున్నాడు. Standarton అనే ప్రాంతం చేరినపుడు ఆంగ్లేయులు గాంధీని ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ నుండి బయటకు నెట్టివేశారు. ఆ రోజు రాత్రి గాంధీ దగ్గరలో ఉన్న St. Peter Maritzberg రైల్వేస్టేషన్‌లో గడిపాడు.
దక్షిణాఫ్రికాలో ఉన్న జాతి వివక్షతను చూసిన గాంధీ ఒక సం.నికి బదులు 22 సం.లు దక్షిణాప్రికాలో ఉండిపోయాడు.
దక్షిణాఫ్రికాలో గాంధీ ఉద్యమాన్ని 2 దశలుగా విభజించవచ్చును. అవి
1) 1898-1906 మొదటి దశ
2) 1906-1915 రెండవ దశ
మొదటి దశ (మితవాద దశ):
ఈ దశలో గాంధీ బ్రిటీషు వారికి పిటిషన్లను పంపేవాడు.
ఈ దశలోనే ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను. 1894లో నాటల్ ఇండియన్ కాంగ్రెస్(జాతీయ)ను స్థాపించాడు.
రెండవ దశ (ప్రతిఘటన దశ):
1906లో బ్రిటీష్ దక్షిణాఫ్రికా ప్రభుత్వం రిజిస్టేషన్ చట్టమును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం దక్షిణాఫ్రికాలోని. ప్రతి ఆసియావాసి తన వేలి ముద్రలతో ఒక సర్టిఫికెట్‌ను పొందాలి.
ఈ సర్టిఫికెట్‌లో తన వ్యక్తిగత సమాచారం ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా గాంధీ మొట్టమొదటిసారిగా 1906లో సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు.
ఫినిక్స్ కాలనీ/టాల్‌స్టాయ్ ఫార్మ్‌ను ట్రాన్స్‌వాల్‌లో ఏర్పాటుచేశాడు. (దీనిలో గాంధీకి సహకరించినది జర్మన్ దేశస్తుడు అయిన అలెన్‌బెక్)
దక్షిణాఫ్రికాలో గాంధీని 'భాయ్' అని పిలిచేవారు.
తర్వాత ఈ రిజిస్ట్రేషన్ చట్టం వెనకకు తీసుకోబడింది.
1913లో బ్రిటీష్ దక్షిణాఫ్రికా ప్రభుత్వం రెండు చట్టాలను ప్రవేశపెట్టింది. అవి
1) క్రిస్టియనేతర తరహాలో జరిగిన వివాహాలు రద్దు అవుతాయి.
2) సరైన పత్రాలు లేకుండా దక్షిణాఫ్రికాలో ప్రవేశించిన ఆసియావాసులకై 3 పౌండ్లు పన్ను విధించుట.
ఈ చట్టాలకు వ్యతిరేకంగా 1913లో గాంధీ 2వ సారి సత్యాగ్రహాన్ని చేపట్టాడు.
అప్పటి బ్రిటీష్ దక్షిణాఫ్రికా గవర్నర్ జనరల్ స్మట్స్‌చే గాంధీజీ అరెస్ట్ చేయబడ్డాడు.
1914లో రిలీఫ్ చట్టంతో పై చట్టాలు విరమించబడ్దాయి. ఇది బ్రహ్మాండమైన విజయం. దక్షిణాఫ్రికాలోని భారతీయులకు గాంధీ ఏకైక నియుక్తుడయ్యాడు. గాంధీ సత్యాగ్రహం అనగా 'శాంతియుత ప్రతిఘటన' గా నిర్వచించాడు. అహింసా విధానం సత్యాగ్రహ ఉద్యమానికి మూలం.
'హింస కన్నా అహింస పరమోత్కృష్టమైనది. శిక్షించడం కన్నా క్షమించడం ధైర్యవంతుల లక్షణం' అని గాంధీ పలికాడు.
1915లో స్మట్స్ గాంధీని విడుదల చేశాడు.
1915 జనవరి 9వ తేదీన గాంధీ భారత్‌కు చేరుకున్నాడు. (గోఖలే అభ్యర్థనపై)
అప్పటి బ్రిటీష్ దక్షిణాఫ్రికా గవర్నర్ జనరల్ స్మట్స్‌చే గాంధీజీ అరెస్ట్ చేయబడ్డాడు.
1914లో రిలీఫ్ చట్టంతో పై చట్టాలు విరమించబడ్దాయి. ఇది బ్రహ్మాండమైన విజయం. దక్షిణాఫ్రికాలోని భారతీయులకు గాంధీ ఏకైక నియుక్తుడయ్యాడు. గాంధీ సత్యాగ్రహం అనగా 'శాంతియుత ప్రతిఘటన' గా నిర్వచించాడు. అహింసా విధానం సత్యాగ్రహ ఉద్యమానికి మూలం.
'హింస కన్నా అహింస పరమోత్కృష్టమైనది. శిక్షించడం కన్నా క్షమించడం ధైర్యవంతుల లక్షణం' అని గాంధీ పలికాడు.
1915లో స్మట్స్ గాంధీని విడుదల చేశాడు.
1915 జనవరి 9వ తేదీన గాంధీ భారత్‌కు చేరుకున్నాడు. (గోఖలే అభ్యర్థనపై)