రాజాజీ ప్రణాళిక(1944)
ఈ ప్రణాళికలోని ప్రధాన అంశాలు
1. భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. ముస్లిం లీగ్ దీనికి మద్దతు ఇవ్వాలి.
2. దీనికి బదులుగా రెండవ ప్రపంచ యుద్ధం అంతమైన తరువాత ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబడుతుంది. ఒకవేళ ముస్లింలు వేరుగా ఉంటామని తమ నిర్ణయాన్ని తెలియజేస్తే వారికి స్వయంప్రతిపత్తి కల్పించబడుతుంది.
భారత జాతీయ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ రాజాజీ ప్రణాళికను తిరస్కరించాయి. కానీ గాంధీ రాజాజీ ప్రణాళికకు మద్దతు ప్రకటించాడు.
వేవెల్ ప్రణాళిక (లేదా) సిమ్లా ప్రణాళిక(1945)
భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్ మధ్య సయోధ్య సాధించడానికి మరియు తాత్కాలిక ప్రభుత్వ చర్చ జరుపుటకు అప్పటి గవర్నర్ జనరల్ వేవెల్ సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించాడు.
ఈ సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ తరపున మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పాల్గొనగా ముస్లిం లీగ్ తరపున జిన్నా పాల్గొన్నాడు.
వేవెల్ తన ప్రణాళికలో హిందువులకు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాడు.
ముస్లింలు కేవలం ముస్లింలీగ్ పార్టీ నుంచి మాత్రమే పాల్గొనాలని జిన్నా పట్టుబట్టడంతో వేవెల్ ప్రణాళిక విఫలమయింది.
కేబినెట్ మిషన్ ప్రణాళిక(1946 మార్చి - మే)
అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ అట్లీ(లేబర్ పార్టీ) తన మంత్రివర్గం లేదా కేబినెట్‌లోని మంత్రులను భారతదేశానికి పంపి భారతదేశంలోని స్థానిక పరిస్థితు లను అధ్యయనం చేసి తగిన సూచనలు చేయవలసిందిగా పేర్కొన్నాడు.
కేబినెట్ మిషన్ సభ్యులు:
1. పెద్విక్ లారెన్స్ (అధ్యక్షుడు)
2, ఎ.వి. అలెగ్జాండర్
3. స్టాఫర్డ్ క్రిప్స్
1946 మేలో కేబినెట్ మిషన్ సిమ్లాలో తన ప్రణాళికను ప్రకటించింది.
1. తక్షణమే భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలి
2. రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ వరిషత్ ఏర్పాటుచేయాలి.
3. భారతదేశంలో రాష్ట్రాలు ఎ,బి,సి అని గ్రూపులుగా విభజించబడతాయి(ఇది అమలులోకి రాలేదు)
ప్రత్యక్ష చర్య(1946 ఆగస్టు 6)
1946 జులైలో జిన్నా గవర్నర్ జనరల్ వేవెల్‌ను కలుసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరాడు. కానీ భారత జాతీయ కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కుదరదని వేవెల్ పేర్కొన్నాడు.
1946 ఆగస్ట్ లో భారత జాతీయ కాంగ్రెస్ సుముఖత చూపడంతో వేవెల్ ప్రభుత్వ ఏర్పాటుకు భారత జాతీయ కాంగ్రెస్‌కు అనుమతి ఇచ్చాడు. తక్షణమే దీనిని ఖండిస్తూ ఆగస్టు 16వ తేదీన బంద్ జరగాలని జిన్నా పిలుపునిచ్చాడు.
ఈ సందర్భంగా జిన్నా క్రింది నినాదాన్నిఇచ్చాడు. .
'లేకర్ రహేంగే పాకిస్తాన్, లద్‌కర్ లేయింగే పాకిస్తాన్'
1946 ఆగస్టు 16వ తేదీన ముస్లింలీగ్ ఆధిపత్యం ఉన్న ప్రాంతాలలో మాత్రమే బంద్ జరిగింది.
ఆగస్టు 16వ తేదీన కలకత్తాలో రెండు వర్గాల మధ్య జరిగిన చిన్న గొడవ మతకల్లోలంగా మారి బెంగాల్, పంజాబ్‌లతో పాటు ఉత్తర భారతదేశం అంతా వ్యాపించింది.
ఈ ఒక్కరోజులో జరిగిన మత కల్లోహల్లో ఇరువర్గాలకు చెందిన
అనేక వేలమంది అమాయక ప్రజలు మరణించారు. దీనినే Direct Action Day గా పేర్కొంటారు.
1946 సెప్టెంబర్‌లో భారత జాతీయ కాంగ్రెస్ జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
1946 అక్టోబర్‌లో ముస్లింలీగ్ ఈ ప్రభుత్వంలో చేరింది. ముస్లింలీగ్‌కు చెందిన “లియాఖత్ ఆలీఖాన్” కొంతకాలం ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసాడు.
1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది.