మౌంట్‌బాటన్ ప్రణాళిక(1947 జూన్ 3):
1947 ఫిబ్రవరి 20న బ్రిటిష్ ప్రధాని అట్లీ క్రింది ప్రకటన చేశాడు.
"1948 జూన్ 30 లోపు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వబడుతుంది"
ఈ ప్రక్రియని పూర్తిచేయడానికి లార్డ్ మౌంట్‌బాటన్ చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్‌గా పంపబడ్డాడు.
1947 మార్చిలో మౌంట్ బాటన్ భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా వచ్చాడు. మొదటిగా అఖండ భారతదేశాన్ని ఏర్పాటుచేయాలని ఇతడు ప్రయత్నించాడు. కానీ స్థానిక పరిస్థితులను గమనించిన తరువాత భారత్‌ను రెండుగా విభజించాలని నిర్ణయించాడు.
వి.పి మీనన్, ముఖర్జీ అనే అధికారుల సహాయంతో మౌంట్ బాటన్ భారతదేశ స్వాతంత్ర్యం మరియు విభజన ప్రణాళిక రూపొందించి బ్రిటన్‌కు పంపాడు.
1947 జూన్ 8న లార్డ్ అట్లీ మౌంట్ బాటన్ ప్రణాళికను బ్రిటిష్ పార్లమెంట్‌లో చదివాడు. అందువల్లనే మౌంట్ బాటన్ ప్రణాళికను జూన్ 3 ప్రణాళిక అని కూడా అంటారు. ఈ ప్రణాళికను 'డిక్కీబర్డ్ ప్రణాళిక' అని కూడా అంటారు.
జూన్ 3 ప్రణాళికలో ప్రధానాంశాలు:
1. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినం ఈ రోజు రెండు స్వతంత్ర్య దేశాలు ఏర్పడతాయి.
ఎ) ఇండియా
బి) 'పాకిస్తాన్
2. ఇండియా మరియు పాక్ మధ్య సరిహద్దు నిర్ణయించుటకు రాడ్ క్లిప్ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది.
3. బెంగాల్ మరియు పంజాబ్‌లలో హిందువులు మరియు ముస్లింలు ఉన్న ప్రాంతాలలో వేర్వేరుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబడుతుంది. ఆ ప్రాంత ప్రజలు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. (తూర్పు బెంగాల్ మరియు పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్‌లో విలీనం కాగా, పశ్చిమ బెంగాల్ మరియు తూర్పు పంజాబ్ ఇండియాలో విలీనం అయ్యాయి)
4. సింధ్ అసెంబ్లీ తన నిర్ణయం తీసుకుంటుంది (సింధ్ పాక్‌లో విలీనం)
5. బెలూచిస్తాన్ ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. (పాకిస్తాన్‌లో ఉండుటకు నిర్ణయం)
6. సంస్థానాలు భారత్ లేదా పాకిస్తాన్‌లో విలీనం అవ్వాలి. వీటికి స్వతంత్ర్య హోదా కల్పించబడదు. (భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం సంస్థానాలకు స్వతంత్రంగా ఉండే అవకాశం కల్పించబడింది.)
బ్రిటిష్ పార్లమెంట్ మౌంట్ బాటన్ ప్రణాళికను భారత స్వాతంత్ర్య చట్టంగా మార్చి తన ఆమోదాన్ని తెలియజేసింది.
1947 జులై 18న అప్పటి బ్రిటిష్ చక్రవర్తి జార్డ్ -IV భారత స్వాతంత్ర్య చట్టానికి రాచరికపు ఆమోదాన్ని (Royal Assent ) ఇచ్చాడు.
దీనితో 1947 ఆగస్టు 14న పాకిస్తాన్, 1947 ఆగస్టు 15న ఇండియా స్వాతంత్ర్యం పొందాయి.
1947 ఆగస్టు 15 నుండి 1950 జనవరి 26 వరకు 6వ జార్జ్ భారతదేశంలో King of UK and India అనే హోదాలో కొనసాగాడు.
1947 ఆగస్టు 14 నుండి 1952 ఫిబ్రవరి వరకు 6వ జార్జ్ పాకిస్తాన్‌కు King of UK and Pakistan అనే హోదాలో కొనసాగాడు.
1952 ఫిబ్రవరిలో జార్జ్మరణానంతరం ఆయన పెద్ద కుమార్తె రెండవ ఎలిజబెత్ పాక్‌లో Queen of UK and Pak అనే హోదాలో కొనసాగింది.
భారతదేశ మొదటి ప్రధాని - జవహర్‌లాల్ నెహ్రు (ఆగస్టు 15వ తేదీన మౌంట్ బాటన్ జవహర్‌లాల్ నెహ్రూను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించాడు)
స్వతంత్ర్య భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ - మౌంట్ బాటన్
భారతదేశ చిట్టచివరి గవర్నర్ జనరల్ - రాజగోపాలాచారి
స్వతంత్ర్య భారతదేశ తొలి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ మరియు ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ - రాజాజీ
భారత రాజధాని - న్యూఢిల్లీ
పాక్ మొదటి ప్రధాని - లియాకత్ ఆలీఖాన్
పాక్ గవర్నర్ జనరల్ - మహ్మద్ ఆలీ జిన్నా
పాక్ రాజధాని - కరాచీ( తరువాత ఇస్లామాబాద్‌కు మార్చబడింది.)