Indian Independence Movement-28

TSStudies

వ్యక్తిగత సత్యాగ్రహం(1940 అక్టోబర్‌ 17)

cripps mission,cripps proposal,cripps mission visited india,quit india movement,1942 Quit India Movement in india,Quit India Movement 8 August 1942,
భారత జాతీయ కాంగ్రెస్‌ తన ప్రభుత్వాలకు రాజీనామాలు చేసిన తరువాత భారతదేశ స్వాతంత్ర్యం కొరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
దీనిలో భాగంగా 1940 అక్టోబర్‌ 17న మహారాష్ట్రలోని వార్దాలో గల 'పల్లనార్‌' అనే గ్రామం నుండి గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహంను ప్రారంభించాడు.
ఈ సందర్భంగా గాంధీ ఆచార్య వినోభాభావేను మొదటి సత్యాగ్రాహి మరియు జవహర్‌లాల్‌ నెహ్రూను రెండవ సత్యాగ్రాహిగా ప్రకటించాడు.
ఆంధ్రాలో వావిలాల గోపాలకృష్ణయ్య వ్యక్తిగత సత్యాగ్రహం చేపట్టాడు.

క్రిప్స్‌ రాయబారం(1942)
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో జర్మన్‌ హిట్లర్‌ సంకీర్ణ సేనలను అతిదారుణంగా ఓడించాడు.
ఇదే సమయంలో జపాన్‌ భారతదేశంపై దాడికి సిద్ధంగా ఉంది.
ఈ సంఘటనలు అమెరికా మరియు చైనా దేశాలను ఆందోళనకు గురిచేశాయి.
యూరప్‌లో హిట్లర్‌ను నియంత్రించడానికి మరియు జపాన్ దాడిని అడ్డుకొనడానికి భారతదేశం మద్దతు కోరవలెనని అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్డ్ మరియు చైనా ప్రధాని ఛాంగై షేకొలు బ్రిటిష్‌ ప్రధాని “విన్‌స్టన్‌ చర్చిల్ పై ఒత్తిడిచేశారు.
దీనితో చర్చిల్‌కు ఇష్టం లేకపోయినప్పటికీ భారత్‌ మద్దతు పొందటానికి క్రిప్స్‌ రాయబారం పంపాడు.. ఇందులో ఈ క్రింది అంశాలు ఉన్నాయి.
1. భారతీయులే భారత రాజ్యాంగాన్ని.రూపొందించుకొనే అవకాశం కల్పించబడును(రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత)
2. రెండవ ప్రపంచ యుద్ధం అంతం అయిన తర్వాత ఇండియాలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోబడతాయి.
3. జపాన్‌ దాడిని అడ్డుకొనుట కొరకు బ్రిటిష్‌ నేతృత్వంలో  ఒక యుద్ధమండలి ఏర్పాటు.
గాంధీ క్రిప్స్‌ రాయబారాన్ని తిరస్కరించి క్రింది విధంగా పేర్కొన్నాడు.
ముందస్తు తేదీ వేసిన చెక్కు(A Post Date Cheque).
జవహర్‌లాల్‌ నెహ్రూ పై పదాలకు క్రింది పదాలను చేర్చాడు.
“దివాలా తీసిన బ్యాంకులో(On A Crashing Bank )"

క్విట్‌ ఇండియా ఉద్యమం (1942)
 క్రిప్స్‌ రాయబారాన్ని తిరస్కరించిన తరువాత ఇండియాలో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా చివరి మహత్తర ఉద్యమాన్ని చేపట్టాలని గాంధీ నిర్ణయించాడు. .
ఈ మహత్తర ఉద్యమానికి “క్విట్‌ ఇండియా” అని పేరు పెట్టాడు. (జపాన్‌ భారతదేశంపై దాడిచేయుటకు సిద్ధంగా ఉండుటచే ఈ పేరు పెట్టాడు)
1942 ఆగస్టు 8న బాంబేలోని 'గవాలియా ట్యాంక్'‌ నుండి క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమయింది.
క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభాన్ని ఆగస్టు తీర్మానం (లేదా) వార్దా తీర్మానం అంటారు.
క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమైన వెంటనే భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులు అందరూ అరెస్ట్‌ చేయబడ్డారు.
గాంధీని 'ఆగాఖాన్‌ ప్యాలెస్'‌లో గృహనిర్బంధం చేశారు
దీనితో క్విట్‌ ఇండియా ఉద్యమం నాయకుడు లేని ఉద్యమంగా మారింది.
కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీకి చెందిన రామ్‌ మనోహర్‌ లోహియా, జయప్రకాష్‌ నారాయణ, ఆచార్య నరేంద్రదేవ్‌ మొదలగువారు క్విట్‌ ఇండియా ఉద్యమవ్యాప్తిలో కీలకపాత్ర పోషించారు.
అరుణా అసఫ్‌ అలీ భారత్‌ అంతా పర్యటించి క్విట్‌ ఇండియా ఉద్యమ వ్యాప్తికి కృషిచేసింది.
దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌, ఉషా మెహతా, సరోజిని నాయుడు మొదలగు మహిళలు రహస్య కార్యకలాపాల ద్వారా క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యాప్తిచేశారు.
ఉషా మెహతా బాంబేలో ఒక రేడియో సర్వీసు ద్వారా  ఉద్యమాన్ని వ్యాప్తిచేసి౦ది.
క్విట్‌ ఇండియా ఉద్యమం భారతదేశంలో అత్యంత  హింసాత్మకంగా జరిగిన ఉద్యమం.
అమెరికా సలహా మేరకు బ్రిటిష్‌. ప్రభుత్వం గాంధీని గృహ నిర్బంధం నుండి విడుదల చేసింది.
భారతదేశంలో తాత్మాలిక ప్రభుత్వ ఏర్పాటు కొరకు మంచి పరిస్థితులను ఏర్పరచుకోవలసిందిగా బ్రిటిష్‌ వారు భారత జాతీయ కాంగ్రెస్‌కు సూచించారు. దీనితో మంచి పరిస్థితులను ఏర్పరచడానికి జిన్నాతో గాంధీజీ చర్చలు జరిపాడు. కానీ  గాంధీ-జిన్నా చర్చలు విఫలమయ్యాయి.