భారతదేశ ఏకీకరణ
భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చినపుడు 562 సంస్థానాలు ఉడేవి. వీటిలో నాలుగు మినహాయించి మిగతా సంస్థానాలు భారత్ లేదా పాకిస్థాన్‌లో విలీనమయ్యాయి. విలీనం కాని నాలుగు సంస్థానాలు
1. హైదరాబాద్
2, ట్రావెన్‌కోర్
3. జునాఘద్
4 కాశ్మీర్
భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చినప్పటికీ ఫ్రెంచ్ వారి ఆధీనంలో పాండిచ్చేరి, పోర్చ్‌గీస్ వారి ఆధీనంలో గోవా డామన్ మరియు డయ్యూలు ఉండేవి.
ఈ ప్రాంతాలు క్రిందివిధంగా భారతదేశంలో విలీనమయ్యాయి
ట్రావెన్‌కోర్ విలీనం (కేరళ)
కులశేఖర వంశస్తులు ట్రావెన్‌కోర్‌ను పాలించారు.
దీని పాలకుడు బలరాం వర్మ ఇతని ప్రధాని సి.పి రామస్వామి అయ్యర్.
ట్రావెన్‌కోర్ ఎటువంటి షరతులు పెట్టకుండా భారతదేశంలో విలీనమైంది.
హైదరాబాద్ విలీనం
హైదరాబాద్‌ను అసఫ్ జాహీ పాలకులు పాలించారు.
7వ నిజాంగా పిలువబడే మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ హైదరాబాద్‌కు పాలకుడిగా ఉన్నపుడు హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయ్యింది.
ఇతని ప్రధానమంత్రి లాయక్ ఆలీ.
1948 సెప్టెంబర్ 13-17 మధ్య మేజర్ జనరల్ చౌదరి నేతృత్వంలో “ఆపరేషన్ పోలో” జరిగింది.
1948 సెప్టెంబర్ 17న ఉస్మాన్ ఆలీఖాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించి హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేశాడు.
జునాఘద్ విలీనం(గుజరాత్)
దీని పాలకుడు - మొహమ్మద్ మహబత్‌కాన్ జీ III
ఇతని ప్రధాని - షానవాజ్ భుట్టో(బెనజీర్ భుట్టో తాత)
జునాఘడ్‌లో హిందువులు అధికంగా ఉండేవారు. మహాబత్‌ఖాన్‌జీ తరువాత కాలంలో జునాఘడ్ ను పాకిస్తాన్‌లో విలీనం చేయడానికి ప్రయత్నించాడు.
ఈ విషయాన్ని తెలుసుకొన్న భారత సైన్యం జునాఘడ్‌ను ముట్టడించి ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది.
జునాఘడ్ ప్రజలు భారతదేశంలో ఉంటామని తమ అభిప్రాయాన్ని తెలియజేయడంతో జునాఘడ్ భారతదేశంలో విలీనం అయింది.
కాశ్మీర్ విలీనం
దీని పాలకుడు హర్‌సింగ్.
గతంలో మహారాజా రంజిత్ సింగ్ కాశ్మీర్ ను ఆక్రమించి కొంతకాలం పాలించాడు.
మహారాజా రంజిత్‌సింగ్ మరణానంతరం పంజాబ్ బలహీనమయింది.
1844-1846 మధ్యకాలంలో మొదటి ఆంగ్లో-సిఖ్ యుద్ధం జరిగింది. పంజాబ్ ఈ యుద్ధంలో పరాజయం పాలై 1846లో లాహోర్ ఒప్పందం కుదుర్చుకొని బ్రిటిష్ వారికి అనేక ప్రాంతాలను యుద్ధ నష్టపరిహారంగా ఇచ్చింది.
వీటిలో కాశ్మీర్ ఒకటి.
బ్రిటిష్ వారు ఈ కాశ్మీర్ ను రూ. 50లక్షలకు 'గులాబ్ సింగ్'కు అమ్మారు.
హర్‌సింగ్ గులాబ్‌సింగ్ సంతతికి చెందినవాడు.
1947 నంవత్సరంలో పాకిస్తాన్ అఫ్ఘాన్ పఠాన్ల సహాయంతో హర్‌సింగ్ యొక్క కాశ్మీర్ లోకి చొరబడి సుమారు 80% కాశ్మీర్‌ను ఆక్రమించింది.
దీనితో హర్‌సింగ్ ఢిల్లీ చేరుకొని జవహర్‌లాల్ నెహ్రూ సహాయాన్ని అర్ధించాడు.
Treaty of Accessation పై సంతకం చేసి కాశ్మీర్ ను భారతదేశంలో విలీనం చేస్తే సహాయం చేయగలనని జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నాడు.
హర్‌సింగ్‌ను. రాజ్ ప్రముఖ్‌ను చేసి కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తానని జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నాడు. (దీని ప్రకారం ఆర్టికల్ 370 రూపొందించడబడింది)
దీనితో హర్‌సింగ్ Treaty of Accessation పై సంతకం చేశాడు.
ఫలితంగా కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అయింది.
అప్పుడు భారత సైన్యం పాకిస్తాన్ సైనికులను వెనక్కు పంపడం ప్రారంభించింది. ప్రస్తుత LOC (ప్రస్తుతం పుంచ్) (Line of Control ) వద్ద భారత సైన్యం చేరుకొన్నప్రుడు అది పూర్తి తరహా యుద్ధంగా మారింది.
ప్రాణనష్టం, ఆస్తి నష్టం అధికంగా ఉండడంతో ఈ యుద్దాన్ని నిలిపివేయవలసిందిగా కోరుతూ జవహర్‌లాల్ నెహ్రూ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.
తక్షణమే ఐరాస రెండు తీర్మానాలు చేసింది.
1. యధాతధస్థితిను పాటించుట
2. ఒక సంవత్సరంలోపు భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్‌లో మరియు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాళ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించాలి.
అప్పటి నుండి వాయువ్య కాశ్మీర్ (30% కాశ్మీర్) పాకిస్తాన్ ఆధీనంలో ఉండిపోయింది.
దీనినే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌గా పేర్కొంటారు.
పాండిచ్చేరి
1760 వందవాసి యుద్ధం తరువాత (ఫెంచ్ వారు తమ ఆధివత్యాన్ని కోల్పోయి పాండిచ్చేరికి పరిమితం అయ్యారు.
1954లో ఒక ఒప్పందం ప్రకారం ఫ్రెంచ్ ప్రభుత్వం పాండిచ్చేరిని భారత ప్రభుత్వానికి అప్పగించింది.
పాండిచ్చేరి అనగా నాలుగు ప్రాంతాలు
1. పాండిచ్చేరి(తమిళనాడు)
2. కరైకల్ (తమిళనాడు)
3. యానాం(ఆంధ్రప్రదేశ్)
4. మాహే(కేరళ)
గోవా, డామన్ డయ్యూ
1661లో పోర్చుగీసు యువరాణి కాథరిన్ బ్రిగాంజా మరియు బ్రిటిష్ యువరాజు రెండవ చార్లెస్ మధ్య వివాహం జరిగింది.
ఈ వివాహ సందర్భంగా పోర్చ్‌గీసు వారు బాంబే లేదా సెయింట్ డేవిడ్‌ను రెండవ చార్తెస్‌కు కట్నంగా ఇచ్చారు.
అప్పటి నుండి బ్రిటిష్ మరియు పోర్చుగీసు మధ్య మంచి సంబంధాలు ఏర్పడి పోర్చుగీసు వారు గోవా, డామన్ డయ్యూ ప్రాంతాలకు పరిమితమయ్యారు.
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చిన తరువాత గోవా, డామన్, డయ్యూలను తమకు అవ్చగించవలసిందిగా భారత ప్రభుత్వం పోర్చుగీసు వారిని అనేకసార్లు విజ్ఞప్తి చేసింది.
వీటిని తిరస్కరించడంతో అహింసా మార్గంలో సత్యాగ్రహాలు చేపట్టి ఈ ప్రాంతాలను పొందవలెనని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
1961 డిసెంబర్‌లో శాంతియుతంగా ఊరేగింపు నిర్వహిస్తున్న సత్యాగ్రాహిలపై పోర్చుగీసువారు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో కొంతమంది మరణించారు. దీనితో భారత ప్రభుత్వం మేజర్ జనరల్ కాండేత్ నేతృత్వంలో సైన్యాన్ని గోవాకు పంపింది.
1961 డిసెంబర్‌లో మేజర్ జనరల్ కాండేత్ నేతృత్వంలో “ఆపరేషన్ విజయ్” జరిగింది.
దీనితో గోవా, డామన్ డయ్యూలు భారత్‌లో విలీనమయ్యాయి.