TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 101 to 150)

TSStudies
0
TSLPRB SI Final Exam Question Paper with Anwer Key

TS SI Final Exam Question Paper With Key 2023

TS SI Arithmetic and Reasoning & Mental Ability Exam 2023

TSLPRB Police SI Preliminary Exam Date - 7 August 2022.

TSLPRB Police SI Final Written Exam Date - 8 April 2023. (Arithmetic & Reasoning)

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (TSLPRB) SI, ASI ఫైన‌ల్ రాత‌ప‌రీక్షలో భాగంగా ఏఫ్రిల్ 8వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ వరకు Arithmetic and Test of Reasoning / Mental Ability ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. 

Booklet Code A

TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 1 to 50)

TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 51 to 100)

101). A, B, C, D, E లు ఐదు మంది వ్యక్తులు. B కి నైరుతి వైపున A ఉన్నాడు. C కి ఉత్తరం వైపున A ఉన్నాడు. D కి ఈశాన్యం వైపున C ఉన్నాడు. E కి  పడమర వైపున D ఉన్నాడు. AB = BC = CD = DE = 1 కి.మీ. అయితే A నుండి E వైపునకు గల దిశ 

1) ఆగ్నేయం     2) దక్షిణం     3) వాయువ్యం     4) పడమర

102. క్రింద ఒక ప్రవచనం వెంబడి I మరియు II సంఖ్యలచే సూచించబడిన రెండు వాదనలు ఉంటాయి. ఈ వాదనలలో ఏది 'బలమైనదో' మరియు ఏది 'బలహీనమైనదో' నిర్ణయించాలి.

ప్రవచనం : కంపెనీకి నిలకడగా లాభాలను ఆర్జించి పెట్టడంలో విఫలమైనందుకు కంపెనీ M.D. Xను తొలగించవలసిందేనా ?

వాదనలు :

I. అవును. పోటీదారులు అందరూ వృద్ధి చేస్తూ లాభాలను ఆర్జించి పెడుతున్నారు కనుక,

II. కాదు. M.D. కు మరియొక అవకాశం ఇవ్వాలి.

1) I మాత్రమే బలమైనది    2) II మాత్రమే బలమైనది

3) I మరియు II లు రెండూ బలమైనవి     4) I కానీ లేదా II కాని ఏదీ బలమైనది కాదు

103) క్రింది వెన్‌ చిత్రాన్ని పరిశీలించండి.

పటం

చతురస్రం 

త్రిభుజం

దీర్ఘవృత్తం 

దీర్ఘచతురస్రం

సూచించేది

బాలురు

బాలికలు

క్రీడాకారులు 

పట్టబద్రులు

పట్టబద్రులు అయిన క్రీడాకారుల సంఖ్యకు మరియు క్రీడాకారులూ కాకుండ పట్టబద్రులూ కాకుండా ఉండేవారి సంఖ్యకు గల మధ్య తేడా సమానమయ్యేది.

1) పట్టబద్రులు అయి, క్రీడాకారులు అయిన బాలుర సంఖ్యకు

2) పట్టబధ్రులు అయి, క్రీడాకారులు కాని బాలుర సంఖ్యకు:

3) పట్టబధ్రులు కాని బాలికా క్రీడాకారుల సంఖ్యకు

4) పట్టబధ్రులు కాని క్రీడాకారుల సంఖ్యకు

104) క్రింద ఇచ్చిన ప్రత్యామ్నాయాలలో (8, 56,72) సంఖ్యాత్రయంలో ఉన్న సంఖ్యల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని కలిగి ఉన్న సంఖ్యాత్రయం ఉన్న ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోండి.

1) (5, 35, 40)    2) 3, 15, 21    3) 7, 49, 63    4) 7, 49, 56

105) A, B, C, D, E, F, G, H అనే ఎనిమిది మంది ఉత్తరం దిక్కుకు చూస్తూ ఒక వరుసలో కూర్చున్నారు. వారి వయస్సులు 12, 18, 27, 32, 34, 49, 55, 63 కాని అదే వరుస కానవసరం లేదు. 49 సంవత్సరాల వయస్సు గల వారికి ఎడమ వైపున రెండవ వానిగా B కుర్చున్నాడు. B మరియు D ల మధ్య ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మరియు B కు కుడివైపున D ఉన్నాడు. D కు కుడివైపున రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి వయస్సు 32 సంవత్సరాలు మరియు ఇతను వరుసలో కుడి చివరన ఉన్నాడు. 32 మరియు 18 వయస్సు ఉన్న వ్యక్తుల మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. E కు ఎడమవైపున రెండవవానిగా A కూర్చున్నాడు. D కు ఎడమవైపున వెనువెంట నే A ఉన్నాడు. B కు ఎడమవైపున వెనువెంటనే ఉన్న వ్యక్తి వయస్సు 63 సంవత్సరాలు. B మరియు G ల వయస్సుల మధ్య తేడా 7 సంవత్సరాలు. వీరిద్దరూ ఒక చోట కూర్చుని లేరు. వరుసలో ఎడమ చివరన 27 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు. D కంటే C 6 సంవత్సరాలు చిన్నవాడు. H మరియు 55 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ప్రక్క ప్రక్కనే ఉన్నారు. H మరియు 34 సంవత్సరాల వయస్సు ఉన్నవారి మధ్య ఉన్న వ్యక్తుల సంఖ్యకు F మరియు 55 సంవత్సరాల వయస్సు ఉన్నవారి మధ్య ఉన్న వ్యక్తుల సంఖ్యకు సమానం. BF మరియు D ల మధ్య ఉన్నవారు

1) G, H    2 ) A, C    3) E, G    4) F, H

106) పురుషులలో కుమార్తెలు మాత్రమే ఉన్నవారు, కుమారులు మాత్రమే ఉన్నవారు, కుమార్తెలు మరియు కుమారులు ఇద్దరూ ఉన్నవారు మరియు పిల్లలు లేని వారిని వర్ణించే వెన్‌ చిత్రం

107) ఉత్తర దిక్కుకు అభిముఖంగా కూర్చొని ఉన్న స్రీలు, పురుషులు ఉన్న ఒక వరుసలో, కుడి నుండి లక్ష్మి 6వ స్థానంలో, విష్ణు 12వ స్థానంలో ఉన్నారు. స్రీలలో లక్ష్మి కుడి నుండి 4వ, ఎడమ నుండి 6వ స్థానంలో ఉంది. పురుషలలో విష్ణు కుడి నుండి 7వ ఎడమ నుండి 24వ స్థానంలో ఉన్నాడు. లక్ష్మి, విష్ణులు వారి స్థానాలను పరస్పరం మార్చుకుంటే, ఎడమ నుండి పురుషులలో విష్ణు ఉండే స్థానం

1) 27    2) 30    3) 28    4) 29

108) 15 మీటర్ల దూరంలో పడమరవైపున ఉన్న తన స్నేహితుడు Qను కలవడానికి P తన ఇంటి నుండి బయలుదేరాడు. కానీ అతని స్నేహితులు S, T, R లను కలిసి వారి ఇళ్ల మీదుగా Q ను చేరుకున్నాడు. P నుండి ఉత్తరంగా 5 మీటర్ల దూరంలో S ఉన్నాడు. S నుండి పడమరగా 3 మీటర్ల దూరంలో T ఉన్నాడు. T నుండి దక్షిణ దిశగా 5 మీటర్ల దూరంలో R ఉన్నాడు. T ఇంటి నుండి Rను కలవకుండా P తిన్నగా Q ను చేరితే, అతనికి కలిసి వచ్చే దూరం

1) 5    2) 3    3) 4    4) 12

109) 7 గురు ఉద్యోగులు A, B, C, D, E, F, G ల సాలరీ స్లిప్‌లు ఒకదానిపై ఒకటి వారి జీతాల వారీగా అవరోహణ క్రమంలో ఉంచబడ్డాయి. F మరియు D ల జీతాల కంటే G జీతం ఎక్కువ. D కనిష్ట జీతం పొందడంలేదు. G గరిష్ట జీతగాడు కాదు. G కంటే A జీతం తక్కువ. రెండవ గరిష్ట జీతం 30,000 రూపాయలు. మూడవ కనిష్ట జీతం 21,000 రూపాయలు. F మూడవ గరిష్ట జీతం పొందడంలేదు. E యొక్క జీతం F జీతం కంటే తక్కువ మరియు D జీతం కంటే ఎక్కువ. C యొక్క జీతం 15,000 రూపాయలు. ఏ రెండు వరుస జీతాల తేడా అయినా 3,000 రూపాయలు అయితే, F మరియు A ల యొక్క జీతాల మొత్తం

1) 45,000     2) 42,000     3) 51,000    4) 48,000

110) క్రింది పటములో ఉండే చతురస్రాల సంఖ్య

1) 10    2) 12    3) 8    4) 0

111) సమాధాన పటాలలో సరి అయినా పటం ఇచ్చిన ప్రశ్నాపట నమూనాను పూర్తి చేస్తుందో ఆ పటాన్ని కనుక్కోండి 

ప్రశ్నాపటం 

సమాధాన పటాలు 

112) క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్దష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి 
1) 8    2) 1331    3) 343    4) 729

113) క్రింద గుర్తు :: కి ముందు ఇచ్చిన మొదటి రెండు అంకెల  మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడవ అంకెతో కలిగిన సంఖ్యను ఐచ్చికాల నుండి కనుక్కోండి 
125 : 243 :: 64 : ?

1) 27    2) 512    3) 81    4) 625

114) క్రింద ఇచ్చిన  ప్రశ్నాపటంలో తెరిచి ఉంచిన ఒక పాచిక పటం ఉంది,

ప్రశ్నాపటం

జవాబు పటాల నుండి ప్రశ్నపటంలో ఇచ్చిన పాచికను మడిచినపుడు ఏర్పడే పాచిక యొక్క రూపాన్ని సూచించే సరియైన సమాధానాన్ని ఎన్నుకోండి.


115) క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్దిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి.

1) రాయి (గ్రానైట్)     2) కాంస్యం (బ్రాంజ్)     3) ఇత్తడి (బ్రాస్‌)     4) ఉక్కు (స్టీల్‌)

116) క్రింద గుర్తు :: కి ముందు ఇచ్చిన మొదటి రెండు పటాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడవ పటంతో కలిగిన పటాన్ని ఐచ్చికాల నుండి ఎన్నుకోండి.

117) ఒక ఘనముపై ఎదురెదురు ముఖాలపై ఉన్న చుక్కల సంఖ్యల మధ్య తేడా 3  అయ్యేటట్లు ప్రతి ముఖంపై 4 లేదా 5 లేదా 6 లేదా 8 లేదా 9 చుక్కలలో ఒకటి ఉండేటట్లు ఉన్నాయి. ఈ క్రింది పటములలో ఏది సరియైనది?


118) క్రింద గుర్తు :: కి ముందు ఇచ్చిన మొదటి రెండు పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడవ పదంతో కలిగిన పదాన్ని ఐచ్చికాల నుండి కనుక్కోండి.
TALENT : LATENT    ::    SYSTEM : ?
1) SESTYM    2) SYSTEM    3) SWIVEL    4) METHOD

119) క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్దిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి.
1) ఉత్కంట (సస్పెన్స్‌)     2) కల్పన (ఫిక్షన్‌)
3) ఉద్వేగం (ధ్రిల్లర్‌)         4) సాహిత్యం (లిటరేచర్‌)

120) స్టేషన్‌ A కి ఉత్తరం వైపున 2 కిలోమీటర్ల దూరంలో స్టేషన్‌ B ఉంది. B కి పడమర వైపున రెండు కిలోమీటర్ల దూరంలో స్టేషన్‌ C ఉంది. C కి ఉత్తరం వైపున 3 కిలోమీటర్ల దూరంలో D ఉంది. D కి తూర్పు వైపున 6 కిలోమీటర్ల దూరంలో స్టేషన్‌ E ఉంది. అయితే B నుండి E వైపునకు గల దిశ మరియు B నుండి E  కి గల కనిష్ట దూరం
1) ఈశాన్యం, 5 కి.మీ.      2) ఆగ్నేయం, 5 కి.మీ.  3) ఈశాన్యం, 3\sqrt 2 కి.మీ.       4) ఆగ్నేయం, 3\sqrt 2 కి.మీ. 

121) A, B, C, D, E, F, G,H అనే 8 మంది వ్యక్తులు ఒక బల్ల చుట్టూ క్రింది విధంగా కూర్చున్నారు. 
i) A, B, C, D బల్ల యొక్క కేంద్రానికి అభిముఖంగా ఉన్నారు.
ii) E, F, G, H లు బల్ల యొక్క కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నారు.
iii) A కి కుడివైపున C ఉన్నాడు
iv) C కి ఎడమవైపున F ఉన్నాడు
v) F కి ఎడమవైపున H ఉన్నాడు
vi) G కి ఎడమవైపున మరియు Fకి కుడివైపున A ఉన్నాడు
vii) B కి కుడివైపున G ఉన్నాడు
viii) H మరియు B ల మధ్య ఒకే ఒక వ్యక్తి E ఉన్నాడు
ix) A మరియు G ల మధ్య ఒకే ఒక వ్యక్తి D ఉన్నాడు
అయితే B మరియు C ల మధ్య కూర్చున్న వ్యక్తులు.
1) F & H    2) E & G    3) H & E    4) A & D 

122) 24 సె.మీ.ల అంచు గల ఒక ఘనం యొక్క అన్ని ముఖాలపై ఎరుపు రంగు వేయబడింది. దానిని 3 సెం.మీ.ల అంచు కలిగిన చిన్న ఘనాలుగా ఖండించాడు. అయితే ఏ ముఖమూ రంగు వేయని చిన్న ఘనాల సంఖ్య మరియు ఖచ్చితంగా ఒకే రంగు వేయబడిన ముఖాన్ని కలిగిన చిన్న ఘనాల సంఖ్యల భేదం
1) 0    2) 152    3) 125    4) 26

123) క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్దిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి.
1) REY    2) CPA    3) QUD    4) TIQ

124) ఒక పాచిక యొక్క రెండు భంగిమలు క్రింద ఇవ్వబడినవి.
క్రింది ముఖంపై 3 ఉంటే, పై ముఖంపై ఉండే సంఖ్యం 
1) 1    2) 2    3) 4    4)6

125) 1000 మంది విద్యార్థులలో, జనరల్‌ స్టడీస్‌ (GS), లాజికల్‌ ఎబిలిటీ (LA) మరియు న్యూమరికల్ ఎబిలిటీ (NA) పాఠ్యంశాలలో కనిష్ట మార్కులు పొందిన విద్యార్థుల వివరాలను క్రింది వెన్‌ చిత్రం సూచిస్తుంది.
దేనిలోనూ కనీస మార్కులు రాని లేదా అన్నింటిలోనూ కనీస మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్య
1) 193    2) 893    3) 182    4) 184

126) క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్దిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి.
1) XTIKM    2) SODFH    3) YUJLN    4)     RMCEG

127) ఇచ్చిన పటములోని సమాంతర చతుర్భుజాల సంఖ్యను లెక్కించండి.
1) 14    2) 15    3)16    4) 17

128) క్రింద గుర్తు :: కి ముందు ఇచ్చిన మొదటి రెండు అంకెల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మొదటి అంకెతో కలిగిన సంఖ్యను ఐచ్చికాల నుండి కనుక్కోండి.

APOC : ?    ::    ITSK : MVUN

1) ERQF    2) WNMZ    3) EQRH    4) WRMK

129) క్రింద ఒక ప్రవచనం వెంబడి I మరియు II సంఖ్యలచే సూచించబడిన రెండు వాదనలు ఉంటాయి. ఈ వాదనలలో ఏది 'బలమైనదో' మరియు ఏది 'బలహీనమైనదో' నిర్ణయించాలి.

ప్రవచనం : జననానికి ముందే పిండం యొక్క లింగ నిర్ధారణను భారతదేశంలో సంపూర్ణంగా నిషేధించాలా ?

వాదనలు :

I. లేదు. చాలా దేశాలలో ప్రినేటల్‌ డయాగ్బస్టిక్‌ టెక్నిక్స్‌ చట్టం లాంటిది లేదు; ఎందుకంటే ప్రజలకు వారి జన్మించని శిశువు లింగ నిర్ధారణ చేసుకోవడం వారి హక్కు

II. అవును స్త్రీ శిశు బ్రూణహత్యలను నిరోధించడానికి మరియు భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో ఉన్న లింగ అంతరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

1) I మాత్రమే బలమైనది     2) II మాత్రమే బలమైనది

3) I మరియు II లు రెండూ బలమైనవి     4) I కానీ లేదా II కాని ఏదీ బలమైనది కాదు

130) క్రింద ఇచ్చిన ప్రశ్నాపటంలో మొదటి రెండు పటముల మధ్య ఎలాంటి సంబంధముందో అలాంటి సంబంధాన్నే మూడవ పటంతో కలిగి ఉండే పటంను క్రింది ప్రత్యామ్నాయాలనుండి ఎన్నుకోండి.

131) క్రింద ఒక ప్రవచనం వెంబడి I మరియు II సంఖ్యలచే సూచించబడిన రెండు వాదనలు ఉంటాయి. ఈ వాదనలలో ఏది 'బలమైనదో' మరియు ఏది 'బలహీనమైనదో' నిర్ణయించాలి.

ప్రవచనం : ప్రతి జిల్లాలోనూ ఒక విశ్వవిద్యాలయం ఉండవలసిందేనా ?

వాదనలు :

I. అవును. ఆర్థికంగా బలహీనులై మరియు మారుమూల గ్రామాలలో నివసించే విద్యార్థులకు వారి ఉన్నత విద్యను అభ్యసించడానికి విశ్వవిద్యాలయాలు అందుబాటులో ఉంటాయి.

II. లేదు. విద్యా ప్రమాణాలను కోల్పోతాము మరియు నిరుద్యోగ సమస్య పెరుగుతుంది.

1) I మాత్రమే బలమైనది     2) II మాత్రమే బలమైనది

3) I మరియు II లు రెండూ బలమైనవి     4) I కానీ లేదా II కాని ఏదీ బలమైనది కాదు

132) ఒక తరగతిలో ఒక పరీక్షను నిర్వహించారు మరియు ఆ పరీక్షలో వారు పొందిన మార్కుల ఆధారంగా వారికి ర్యాంకులను కేటాయించారు.ఒక విద్యార్థి A యొక్క ర్యాంకు పై నుండి 20 వది మరియు క్రింది నుండి 23 వది గా గమనించారు. మరొక విద్యార్థి B యొక్కర్యాంకు ఉత్తీర్ణులైన విద్యార్థులలో పై నుండి 10వది మరియు క్రింది నుండి 19 వది. అయితే ఆ పరీక్షలో ఉత్తీర్జులైన మొత్తం విద్యార్థుల సంఖ్య

1) ఆ పరీక్షలో తప్పిన మొత్తం విద్యార్థుల సంఖ్యకు సమానం

2) ఆ పరీక్షలో తప్పిన మొత్తం విద్యార్థుల సంఖ్యకు మూడు రెట్లు

3) ఆ పరీక్షలో తప్పిన మొత్తం విద్యార్థుల సంఖ్యక్తు 1/2 రెట్లు

4) పరీక్షలో తప్పిన మొత్తం విద్యార్థుల సంఖ్యకు రెండు రెట్లు

133) ఒక్కొక్క వరుసలో ఆరు మంది గల రెండు వరుసలలో పన్నెండు మంది కుర్చున్నారు. వరుస-1 లో పడమర దిశకు అభిముఖంగా A, B, C, D, E, F లు కూర్చున్నారు మరియు వరుస-2 లో తూర్చు దిశకు అభిముఖంగా P, Q, R, S, T, U లు కుర్చున్నారు. ప్రక్క ప్రక్కన కూర్చున్న వ్యక్తుల మధ్య సమాన దూరం ఉంది మరియు వరుస-1 లో కూర్చున్న ప్రతి వ్యక్తి వరుస-2 లో కూర్చున్న ఏదో ఒక వ్యక్తికి నేరుగా అభిముఖంగా ఉంటాడు. S మరియు R ల మధ్య ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. R చిట్ట చివరన కూర్చోలేదు. R యొక్క ఎడమవైపున S ఉన్నాడు. S మరియు R ల మధ్య P లేడు. Q కి ఇరువైపున ప్రక్కనే U మరియు T లు ఉన్నారు. Pమరియు T మధ్య ఒకే ఒక వ్యక్తి కూర్చున్నాడు. S మరియు P లకు వరుసగా B మరియు C లు నేరుగా అభిముఖంగా ఉన్నారు. B కు ఎడమవైపున మూడవ వ్యక్తి A మరియు C కి కుడివైపున మూడవ వ్యక్తి D.  C కి ప్రక్మనే F ఉన్నాడు. అయితే E కి నేరుగా అభిముఖంగా కూర్చున్న వ్యక్తి 

1) T    2) U    3) Q    4) R

134) అన్ని ముఖాలకు నీలి రంగు వేయబడిన ఒక దీర్హఘనం యొక్క కొలతలు 24 సెం.మీ.లు, 18 సెం.మీ.లు, మరియు 12 సెం.మీ.లు మరియు ఆ దీర్హఘనాన్ని చిన్న ఘనాలుగా ఖండిస్తే ఏర్పడిన ఒక్కొక్క ఘనం యొక్క ఘనపరిమాణం 8 ఘనపు సెం.మీ.లు అయితే రంగు వేయబడిన ముఖం ఒకే ఒకటి కలిగిన చిన్న ఘనాల సంఖ్యకు సమానమైనది.

1) 33 X (రెండు రంగు వేయబడిన ముఖాలు గల చిన్న ఘనాల సంఖ్య) + 20

2) ఏ ముఖము పైనా రంగు లేని చిన్న ఘనాల సంఖ్య) ─ 4

3) 3 X (రెండు రంగు వేయబడిన ముఖాలు గల చిన్న ఘనాల సంఖ్య) ─ 20

4)  (ఏ ముఖము పైనా రంగు లేని చిన్న ఘనాల సంఖ్య) + 4

135) క్రింద గుర్తు :: కి ముందు ఇచ్చిన మొదటి రెండు పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడవ పదంతో కలిగిన పదాన్ని ఐచ్చికాల నుండి కనుక్కోండి.

SUM : 53    ::    TEN : ?

1) 42    2) 64    3) 35    4) 39 

136) క్రింద ఇచ్చిన పటము యొక్క జల ప్రతిబింబం.

137) ఒక ఘనము యొక్క ఒక్కొక్క ముఖంపై ఒక్కొక్క రంగు చొప్పున ఆరు ముఖాలపై ఆరు రంగులు వేయబడియనవి, నలుపు రంగు వేసిన ముఖానికి ఎదురు ముఖంపై ఎరుపు రంగు వేయబడింది. తెలుపు రంగు ముఖానికి ప్రక్క ముఖంపై నీలం రంగు, నీలి రంగుముఖంకు ప్రక్క ముఖంపై ఊదా రంగు  వేయబడినది. ఒక ముఖంపై పసుపు రంగు వేయబడినది. పసుపు రంగు వేసిన ముఖముకు ఎదురు ముఖంపై వేసిన రంగు

1) ఊదా రంగు 2) తెలుపు         3) నీలం     4) నలుపు

138) పటము (A) లో చూపిన విధంగా ఒక కాగితం మడత పెట్టి కత్తిరించబడింది. కత్తిరించిన తరువాత తెరిస్తే అది ఉండే పోలిక 


139) క్రింద గుర్తు :: కి ముందు ఇచ్చిన మొదటి రెండు అంకెల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మొదటి అంకెతో కలిగిన సంఖ్యను ఐచ్చికాల నుండి కనుక్కోండి.

64 : ?    ::    72 : 53

1) 44    2) 70    3) 52    4) 48

140) 'MIRROR' అనే పదం యొక్క కుడివైపు దర్పణాన్ని ఉంచినట్లయితే ఆ పదం యొక్క దర్పణ ప్రతిబింబానికి జల ప్రతిబింబం 

141) క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్దిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి.

1) 4913    2) 3375    3) 2197    4) 2916

142) క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్దిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి.

1) heart    2) kidney    3) femur    4) liver

143) క్రింది పటంలో త్రిభుజం గృహిణులను, చతురస్రం మహిళా ఉద్యోగులను, వృత్తం తల్లులను మరియు దీర్ధవతురస్రం మహిళా పట్టభద్రులను తెలుపుతాయి. అయితే పిల్లలు గల పట్టభద్రులయిన మహిళా ఉద్యోగుల సంఖ్య

1) 1    2) 8    3) 5    4) 7

144) ఒక తరగతిలో A యొక్క ర్యాంకు పై నుండి 3 వది మరియు B యొక్కర్యాంకు క్రింది నుండి 13వది. C యొక్క స్థానం A తరువాత 8 వ స్థానం మరియు A, B లకు ఖచ్చితంగా మధ్యన ఉన్నది అయితే ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్య

1) 32    2) 29    3) 30    4) 31

145) వృత్తాకారపు బల్ల కేంద్రాన్ని చూస్తూ నాలుగు పెళ్ళయిన జంటలు కూర్చున్నాయి. ప్రతి భార్య ఆమె భర్త ప్రక్కనే కూర్చుంది.  ప్రతి పురుషుడు L, M, N, O అనే పేరు గల స్వీట్స్ లలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఇష్టపడతారు. ఎనిమిది మంది వ్యక్తుల పేర్లు A,B,C,D,E,F,G,H.  వ్యక్తులు D మరియు H లు కలిసి ఉన్నారు. D కు L ఇష్టం మరియు H కు M ఇష్టం. N ఇష్టపడే వాని భార్య G మరియు ఈమె H కు కుడి వైపున రెండవ స్థానంలో కూర్చుంది. G మరియు H మధ్య F కూర్చున్నారు. O ను ఇష్టపడే వాని భార్య B, స్వీట్‌ O ను C ఇష్టపడడు. E ఒక పురుషుడు. ఒకే ఒక స్త్రీల జంట ప్రక్క ప్రక్శన్న ఉంటే, E కు ఎడమవైపున 3వ స్థానంలో ఉండేది. 

1) G    2) A    3) H    4) C

146) క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్దిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి

1) G    2) K    3) M    4) V

147) క్రింద గుర్తు :: కి ముందు ఇచ్చిన మొదటి రెందు పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందొ అలాంటి సంబంధాన్ని మూడవ పదంతో   కలిగిన పదాన్ని ఐచ్చికాల న్తుండ్రి కనుక్కోండి

Anthropology : Human being    ::    Ornithology : ?

1) Insects    2) Reptiles    3) Volcanoes    4) Birds

148) పై పటంలో A వద్ద ఉదయం 8 గంటలకు బయలుదేరి చివరగా B వద్దకు ఒక వ్యక్తి ఉదయం 9 గంటలకు చేరాడు. B వద్ద ఆ వ్యక్తి యొక్క నీడ A ఉన్న వైపుకు పడింది. BR రేఖాఖండానికి క్రింద Q 24మీటర్ల లంబ దూరంలో ఉంటే, B నుండి A ఉండే దిక్కు మరియు A, B ల మధ్య దూరం (మీటర్లలో)

1) నైరుతి మరియు 4    2) ఈశాన్యం మరియు 4

3) ఈశాన్యం మరియు  9\sqrt 2      4)  వాయువ్యం మరియు 9\sqrt 2

149)  క్రింద ఒక ప్రవచనం వెంబడి I మరియు II సంఖ్యలచే సూచించబడిన రెండు వాదనలు ఉంటాయి. ఈ వాదనలలో ఏది 'బలమైనదో' మరియు ఏది 'బలహీనమైనదో' నిర్ణయించాలి.

ప్రవచనం : తోలు వస్తువులను తయారు చేయడం నిషేధించాలా ?

వాదనలు :

I. అవును. మానవాళికి ఉపయోగపడే కారణం కాక మరే ఇతర కారణంగానైనా జంతువులను చంపడం వల్ల జీవావరణ సమతుల్యత లోపానికి దారి తీస్తుంది.

II. కాదు. తోలు వస్తువుల ద్వారా మన దేశం విదేశీ మారకంను సంపాదిస్తుంది.

1) I మాత్రమే బలమైనది     2) II మాత్రమే బలమైనది

3) I మరియు II లు రెండూ బలమైనవి     4) I కానీ లేదా II కాని ఏదీ బలమైనది కాదు

150) గుర్తు :: కి ముందు ఉన్న జతకు ఎలాంటి సంబంధముందో అలాంటి సంబంధాన్ని కలిగిన జతను ఐచ్చికాల నుండి ఎన్నుకోండి

Pulp : Paper    :: 

1) Flax : Linen    2) Duke : Dutches    3) Stallion : Colt    4) Another : Books


TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 151 to 200)

TS SI Final Exam 2023 Official Answer Key (https://www.tslprb.in/)

TS Police Exams Previous Question Papers

Post a Comment

0Comments

Post a Comment (0)