TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 51 to 100)

TSStudies
0
TSLPRB SI Final Exam Question Paper with Key

TS SI Final Exam Question Paper With Key 2023

TS SI Arithmetic and Reasoning & Mental Ability Exam 2023

TSLPRB Police SI Preliminary Exam Date - 7 August 2022.

TSLPRB Police SI Final Written Exam Date - 8 April 2023. (Arithmetic & Reasoning)

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (TSLPRB) SI, ASI ఫైన‌ల్ రాత‌ప‌రీక్షలో భాగంగా ఏఫ్రిల్ 8వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ వరకు Arithmetic and Test of Reasoning / Mental Ability ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. 

Booklet Code A

TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 1 to 50)

51) భార్య వయస్సు ఆమె భర్త వయస్సు కన్నా 6 సంవత్సరాలు తక్కువ. ఆమెకు రెండవ ప్రసవమైనప్పుడు ఉన్న ఆమె వయస్సు, ఆమెకు మొదటి ప్రసవమైనప్పుడు ఉన్న ఆమె భర్త వయస్సుకు సమానం. వారి వివాహం అయ్యే నాటికి వారి వయస్సుల నిష్పత్తి 15 : 12. వివాహం అయిన 8 సంవత్సరాలకు వారికి రెండవ సంతానం కలిగినది. అయితే మొదటి సంతానం కలిగే నాటికి వారి వయస్సుల నిష్పత్తి

1) 10 : 7     2) 14 : 11     3) 19 : 16    4) 16 : 13

52) 1863, జనవరి 12వ తేదీ వారంలోని ఏ రోజౌతుందో ఆ రోజు

1) మంగళవారం     2) శనివారం     3) ఆదివారం     4) సోమవారం

53) ట్రాక్‌పై A కంటే 40 మీటర్ల ముందే B ఉండగా ప్రారంభించిన ఒక 1000 మీటర్ల పరుగు పందెంలో 19 సెకండ్ల తేడాతో A గెలుస్తాడు. అదే పందెంలో B బయలుదేరిన 30 సెకండ్ల తరువాత A బయలుదేరితే, 40 మీటర్ల తేడాతో B గెలుస్తాడు. అయితే 5 కి.మీ.ల దూరాన్ని పరుగెత్తడానికి B కి పట్టే సమయం (నిమిషాలలో)

1) 10     2) 12     3) 10.5    4) 12.5

54) 1990 డిసెంబర్‌ 13వ తేదీ గురువారం అయితే, 1987 మే 23వ తేదీ వారంలో ఏ రోజౌతుందో ఆ రోజు

1) గురువారం     2) శుక్రవారం     3) శనివారం     4) ఆదివారం    

55) ఒక పుస్తక విక్రేత రొక్కం వెంటనే చెల్లిస్తే ప్రకటిత ధరపై 20% రాయితీనీ, అరువుపై చెల్లిస్తే ప్రకటిత ధరపై 10% రాయితీనీ ఇస్తున్నాడు. ఒక వ్యక్తి 70% పుస్తకాలను రొక్కానికి, 30% పుస్తకాలను అరువుకు కొంటే, అతనికి వచ్చిన నికర రాయితీ

1) 15%     2) 16%     3) 17%     4) 18%

56) 65 మీటర్ల పొడవుగల నిచ్చెన ఒక గోడపై మరియు నేలపై ఆనుకొని ఉంది. తొలుత నిచ్చెన అడుగు భాగము గోడ నుండి 25 మీటర్ల దూరంలో ఉంది. గోడపై అనుకొని ఉన్న నిచ్చెన కొన 8 మీటర్లు కిందికి మరియు నేలపై ఉన్న కొనగోడ నుండి దూరంగా తొలి స్థానం నుండి x మీటర్లు జరిగితే, 3x, 4x, 5x కొలతలు కల్గిన త్రిభుజ వైశాల్యం (చ.మీటర్లలో)

1) 1176    2) 1074     3) 1254     4) 938

57) ఎత్తు 4 అడుగులు, వ్యాసార్థం 3 అడుగులు ఉన్న ఒక ఘనలోహ స్థూపాన్ని కరిగించి ఒక ఘనగోళంగా మార్చారు. అయితే స్థూపం యొక్క వక్రతల వైశాల్యం మరియు గోళం యొక్క ఉపరితల వైశాల్యాల నిష్పత్తి

1) 1:2     2) 3:4     3) 2:3    4) 3:5

58) A మరియు B అనే పిల్లల వయస్సులు ఇలా ఉన్నాయి. A వయస్సుకు రెండు రెట్లు, B వయస్సుకు అయిదు రెట్ల విలువలను కలిపితే వచ్చే మొత్తం, A వయస్సుకు అయిదు రెట్లు, B వయస్సుకు రెండు రెట్ల విలువను కలిపితే వచ్చే మొత్తం కంటే ఆరు తక్కువ. వారి వయస్సుల వర్గాల భేదం 36 అయిన, వారి వయస్సుల లబ్దం

1) 70     2) 69     3) 80    4) 24

59) 10 పైపుల సమూహం A ఒక ఖాళీ తొట్టెను 10 నిమిషాలలో నింపగలదు. 5 పైపుల సమూహం B ఖాళీగా ఉన్న అదే తొట్టెను 8 నిమిషాలలో నింపగలదు. 10 పైపుల సమూహం C నిండుగా ఉన్న అదే తొట్టెను 20 నిమిషాలలో ఖాళీ చేయగలదు. సమూహం A మరియు సమూహం B లకు ఒక్కొక్క పైపును జత చేయడమైనది. సమూహం C కు రెండు పైపులను జత చేయడమైనది. అన్ని పైపులను ఒకేసారి తెరిస్తే ఖాళీ తొట్టె నిండే సమయం (నిమిషాలలో)

1) 5    2) 9    3) 12    4) 15

60) ఒక ఎక్స్‌ప్రెస్‌ రైలు యొక్క వేగం గంటకు 90 కి.మీ, మరియు ఒక ప్యాసెంజర్‌ రైలు యొక్క వేగం గంటకు 45 కి.మీ, 81 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ప్రతిసారీ ఎక్స్‌ప్రెస్‌ రైలు 2 నిమిషాల పాటు ఆగుతుంది మరియు 39 కిలోమిటర్ల దూరం ప్రయాణించిన ప్రతిసారీ ప్యాసెంజర్‌ రైలు 3 నిమిషాల పాటు ఆగుతుంది. రెండు రైళ్లు ఒకే సారి బయలుదేరితే, ఎక్స్‌ప్రెస్‌ రైలు 450 కి.మీ. ల దూరం పూర్తి చేసే సమయానికి ప్యాసెంజర్‌ రైలు ప్రయాణించే కి.మీ.ల సంఖ్య

1) 225     2) 221.25    3) 222.75     4) 220.25

61) ప్రతి మూడు నిమిషాలకు పడిన నీటి ఘనపరిమాణం రెట్టింపు అయ్యేటట్లు తొట్టిలో నీరు నింపబడుతోంది. ఖాళీ తొట్టి నిండడానికి 27 నిమిషాలు పడితే, ఆ తొట్టిలో 8 వ వంతు నింపడానికి పట్టే సమయం (నిమిషాలలో)

1) 15    2) 18    3) 21    4) 12

62) 4 కి.మీ.ల పరుగు పందెంలో, Bని, A 400 మీటర్ల తేడాతో లేదా 2 నిమిషాల తేడాతో ఓడించగలడు. అయితే ఆ పందేన్ని A పూర్తి చేయగలిగే సమయం (నిమిషాలలో)

1) 20     2) 16     3) 22    4) 18

63) ఒక డొల్లగానున్న స్థూపాకారపు పైపు వ్యాసార్థం మరియు ఎత్తులు వరుసగా r మరియు h అనుకుందాం. ఒక్కొక్కటి 'h' ఎత్తు కల్గిన రెండు గరిష్ట ఘన శంకువులను ఆ స్థూపం యొక్క రెండు వృత్తాకార ముఖముల కేంద్రములు ఒక్కొక్కటి ఆ శంకువుల భూవృత్తాలపై ఉండేటట్లు ఉంచారు. అప్పుడు ఆ స్థూపం ఘనపరిమాణం మరియు దానిలోని ఖాళీ ప్రదేశం యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి

1) 35:12     2) 24:23     3) 6:5     4) 4:3

64) ఒక వ్యక్తి తన 100వ పుట్టిన రోజును గురువారం, సెప్టెంబర్‌ 15వ తేదీ 2022 న జరుపుకుంటే, ఆ వ్యక్తి పుట్టిన రోజు వారంలోని ఏ రోజౌతుందో ఆ రోజు

1) శనివారం     2) గురువారం     3) శుక్రవారం     4) బుధవారం

65) బంగారం బరువు అల్యూమినియం బరువుకు 17 రెట్లు. రాగి బరువు అల్యూమినియం బరువుకు 7 రెట్లు. బంగారం, రాగిల మిశ్రమం అల్యూమినియం బరువుకు 15 రెట్ల బరువు ఉండేలాగా బంగారం మరియు రాగిని కలిపితే, వాటి నిష్పత్తి

1) 8:17     2) 2:1     3) 4:1    4) 4:3

66) రెండు కుళాయిలు A, B లు ఒక ఖాళీ తొట్టిని వరుసగా 32 నిమిషాలు మరియు 36 నిమిషాలలో నింపగలవు. A నుండి 4/5 వవంతు నీరు మరియు B నుండి 3/5వ వంతు నీరు వచ్చేటట్లుగా A, B లను ఒకేసారి పాక్షికంగా తెరిచారు. అప్పుడు ఖాళీ తొట్టిని నింపడానికి కావలసిన మొత్తం సమయం (నిమిషాలలో)

1) 25     2) 35     3) 38    4) 24

67) 8 మరియు 9 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని రెండు ముల్లులు మొదటిసారిగా లంబ కోణంలో ఉంటాయి ?

1) 8 గంటల 28\frac{3}{{11}}  నిమిషాలకు      2) 8 గంటల 26\frac{9}{{11}} నిమిషాలకు

3) 8 గంటల  29\frac{1}{{11}} నిమిషాలకు     4) 8 గంటల 27\frac{3}{{11}} నిమిషాలకు

68) ఒక పాత్రలోని ద్రవంలో 8 భాగాలు నీరు మరియు 12 భాగాలు పాలు ఉన్నాయి. అయితే మిశ్రమంలోని నీరు మరియు పాల నిష్పత్తి 7:3 గా ఉండాలంటే, పాత్రలోని మిశ్రమంలో ఎంత భాగాన్ని పక్కకు తీసి దానిని నీటితో భర్తీ చేయాలో ఆ భాగం

1) \frac{6}{5}    2) \frac{1}{2}    3) \frac{3}{4}    4) \frac{4}{5}

69) 5 సెం. మీ వ్యాసార్థం గల ఒక వృత్తం యొక్క కేంద్రం C అనుకుందాం. A మరియు B ఆ వృత్తంపై రెండు బిందువులు అనుకుందాం. చాపం AB పొడవు 15 సెం. మీ. మరియు చాపం AB , జ్యా AB ల మధ్య గల వైశాల్యం K చ. సెం. మీ. అయిన \frac{2}{{25}}K + \sin 3 =

1) 0    2) 3    3) 3.5    4) 2.5

70)  ఒకదాని తర్వాత మరొకటిగా 10% చొప్పున రాయితీని వరుసగా రెండుసార్లు ఇచ్చిన తర్వాత 10% లాభం వచ్చేటట్లు  ఒక దుకాణదారుడు ఒక వస్తువుపై ధరను ప్రకటిస్తాడు. ఆ వస్తువు యొక్క కొన్న వెల 16,200 రూపాయలైతే అప్పుడు దాని ప్రకటిత ధర (రూపాయలలో)

1) 19,200    2) 21,562.20       3) 22,000    4) 22,124.60

71) ఒక వ్యక్తి గంటకు 12 కి. మీ. వేగంతో ప్రయాణించి తాను ఎక్కవలనిన బన్సు బయలుదేరే నమయం కంటే, 10 నిముషాలు ఆలస్యంగా బస్‌స్టేషన్‌ చేరుకున్నాడు. మరునాడు గంటకు 15 కి.మీ. వేగంతో ప్రయాణించి బస్‌స్టేషన్‌ను బస్‌ బయలుదేరే సమయం కంటే 10 నిమిషాల ముందుగా చే'రుకున్నాడు. సరిగ్గా బస్‌ బయలుదేరే సమయానికి బస్‌స్టేషన్‌ను చేరుకోవడానికి అతను ఎంత వేగంతో ప్రయాణించాలి?

1) \frac{{40}}{3} కి.మీ./గం. 2) 14 కి.మీ./గం. (3) \frac{{25}}{2} కి.మీ./గం. (1) \frac{{57}}{4} కి.మీ./గం.

72) A యొక్క భార్య B. Pమరియు Qలు A మరియు B ల కుమార్తెలు B మరియు Pల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 5 : 3. A యొక్క ప్రస్తుత వయస్సు Q యొక్క ప్రస్తుత వయస్సుకు రెండు రెట్లు. 15 సంవత్సరాల క్రితం A యొక్క వయస్సు Q యొక్క అప్పటి వయస్సుకు మూడు రెట్లు. Q కంటే P మూడు సంవత్సరాలు పెద్దది. అయితే B యొక్క ప్రస్తుత వయస్సు (సంవత్సరాలలో)

1) 50     2) 55    3) 45     4) 48

73) ప్రస్తుతం A మరియు అతని భార్య Bల సగటు వయస్సు 41. మూడు సంవత్సరాల క్రితం,A, B మరియు వారి కుమారుడు Cల అప్పటి వయస్సుల సగటు 26. రెండు సంవత్సరాల తర్వాత C యొక్క వయస్సు C యొక్క అప్పటి వయస్సుకు 6 రెట్లు ఉంటుంది. అయితే A యొక్క ప్రస్తుత వయస్సు (సంవత్సరాలలో)

1) 42    2) 43     3) 44     4) 45

74) ఒక రైలు స్టేషన్‌ A నుండి ఉదయం 8 గంటలకు, 390 కి.మీ.ల దూరంలో ఉన్న స్టేషన్‌ B వైపుకు బయలుదేరింది. ఈ రైలు గంటకు

65కి. మీ.ల వేగంతో మొదట 1 గంట ప్రయాణించి, మిగిలిన సమయంలో గంటకు 50 కి.మీ.ల వేగంతో ప్రయాణించింది. మరియొక రైలు B స్టేషన్‌ నుండి A స్టేషన్‌ వైపుకు ఉదయం 9 గంటలకు బయలుదేరింది. ఈ రైలు గంటకు 35 కి.మీ.ల వేగంతో మొదట 1 గంట ప్రయాణించి, మిగిలిన ప్రయాణాన్ని గంటకు 50 కి.మీ. వేగంతో ప్రయాణించింది. అయితే ఆ రెండు రైళ్లు కలిసే సమయం

1) మధ్యాహ్నం 12.40     2) ఉదయం 11.40     3)మధ్యాహ్నం 12.24     4) ఉదయం 11.24

75) ఒక పడవ ప్రవాహం వెంబడి 66 కి.మీ.ల దూరాన్ని 90 నిమిషాలలోనూ మరియు అదే దూరాన్ని ప్రవాహానికి అభిముఖంగా 110 నిమిషాలలోనూ ప్రయాణించగలదు. ఇరు దిశలలోనూ నిశ్చలమైన నీటిలో ఆ పడవ వేగం ఒక్కటే. అయితే ఆ పడవకు నిశ్చలమైన నీటిలో అదే వేగంతో అదే దూరాన్ని ప్రయాణించడానికి కావలసిన సమయం (నిమిషాలలో)

1) 96     2) 98     3) 105     4) 99


76. నిశ్చలమైన నీటిలో ఒక పడవ వేగం ఒక నదిలోని నీటి ప్రవాహ వేగానికి 5 రెట్లు. ఆ నదిలో ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈ పడవ 10.2 కి.మీ.ల దూరాన్ని 51 నిమిషాలలో ప్రయాణించగలదు. గంటలో \frac{3}{4} వ వంతు కాలంలో, అదే ననిలో ఆ పడవ నీటి ప్రవాహ వెంబడి ప్రయాణించే దూరం (కి.మీ లలో)

(1) 14.4     2) 13.5     3) 12     4) 11

77) ఒక వస్తువు ప్రకటిత ధరపై 15% తగ్గింపును అనుమతిస్తే, ఒక వినియోగదారుడు 1,700 రూపాయలకు, తగ్గింపును అనుమతించకుంటే వచ్చే వస్తువుల సంఖ్య కంటే 15 వస్తువలను అదనంగా పొందుతాడు. అయితే ఒక్కొక్క వస్తువు యొక్క ప్రకటిత ధర (రూపాయలలో)

1) 25     2) 20     3) 36      4) 48

78) ఒక గడియారం రోజుకు 5 నిమిషాలు ఆలస్యంగా తిరుగుతుంది. ఆ గడియారాన్ని సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సరైన సమయాన్ని అమర్చి ప్రారంభిస్తే ఎన్నవ రోజున మరియు ఏ రోజున అది 11 A.M. చూపిస్తుంది ?

1) 12వ రోజు శుక్రవారం     2)  15వ రోజు మంగళవారం

3) 15వ రోజు బుధవారం     4) 12వ రోజు శనివారం

79) ముగ్గురు వ్యక్తులు 50 లక్షలు, 90 లక్షలు, 60 లక్షల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరాంతంలో వారికి వ్యాపారంలో నష్టం వచ్చింది. రెండవ సంవత్సరాంతానికి లాభం పొందారు. వారు నష్టాన్ని లేదా లాభాన్ని వారు మొట్టమొదటిగా పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకున్నారు. మొదటి సంవత్సరాంతానికి వచ్చిన నష్టంలో C వాటా 6 లక్షలు అయితే మొత్తం నష్టం 

1) 20 లక్షలు     2) 25 లక్షలు    3) 18 లక్షలు     4) 15 లక్షలు

80) మూడు పాత్రల పరిమాణాల నిష్పత్తి 3:2:1. ప్రతి పాత్ర వాటి పూర్తి పరిమాణాల మేరకు పాలు, నీరుల మిశ్రమాన్ని కలిగి ఉన్నాయి. మూడు పాత్రలలోను ఉన్న మిశ్రమంలో పాలు మరియు నీరుల నిష్పత్తి వరుసగా 7:5, 5:3 మరియు 1:3. ప్రతి పాత్ర నుండి ఒక్కో లీటరు చొప్పున మిశ్రమాన్ని తీసి వాటిని ఒక కొత్త పాత్రలో కలిపి ఉంచారు. ఈ మిశ్రమంలో పాలు, నీరుల నిష్పత్తి x:y అనుకుందాం. ప్రతి పాత్రలోని పూర్తి పరిమాణంలో ఉన్న మిశ్రమాలను మరొక కొత్త పాత్రలో కలిపితే, వచ్చే మిశ్రమంలో పాలు, నీరుల నిష్పత్తి p:q అయితే, xp:yq =

1) 455: 481     2) 455:407    3) 385:481.     4) 257:352

81) కొంత సొమ్మును పెట్టుబడిగా పెట్టి A ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యాపారాన్ని ప్రారంభించిన 2 నెలల తరువాత గీపెట్టుబడికి  \frac{4}{3}  రెట్లు పెట్టుబడితో Aతో B చేరాడు. వ్యాపారంలో B చేరిన 2 నెలల తరువాత Aపెట్టుబడికి  \frac{2}{3} వ వంతు పెట్టుబడితో A, B లతో C చేరాడు. వ్యాపార నిర్వహణకు గాను పనిచేసే భాగస్వామిగా Aకి లాభంలో 8% ఇచ్చిన తరువాత, లాభంలో మిగిలిన సొమ్మును A, B, C లకు వారి పెట్టుబడుల అనుపాతానికి అనుగుణంగా పంపిణీ చేశారు. సంవత్సరాంతానికి మొత్తం లాభం 25,000 రూపాయలైతే, వార్షిక లాభం నుండి A పొందిన మొత్తం సొమ్ము (రూపాయలలో)

1) 11,000    2) 10,000     3) 9,000     4) 4,000

82) సాధారణ గడియారంలో 10 సెకండ్ల కాలాన్ని, లోపమున్న ఒక డిజిటల్‌ గడియారం 1 నిమిషంగానూ అలాంటి 60 నిమిషాలను ఒక గంటగా లెక్కిస్తుంది. ఈ గడియారంలో సమయమూ మరియు వారంలోని రోజు రెండూ డిస్‌ప్లేలో కనిపిస్తాయి. ఒక సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అది సాధారణ గడియారంలోని సమయాన్నే చూపించింది. అదే రోజు సాదారణ గడియారంలోని సమయం సాయంత్రం 4 గంటలయితే అప్పుడు డిజిటల్‌ గడియారం డిస్‌ప్లేలో కనిపించేది

1) సోమవారం మధ్యాహ్నం 12 గంటలు     2) మంగళవారం ఉదయం 6 గంటలు

3) సోమవారం ఉదయం 2 గంటలు         4) మంగళవారం మధ్యాహ్నం 12 గంటలు

83) A, B లు ఒక 2000 మీటర్ల వృత్తాకారపు ట్రాక్‌ చుట్టూ వరుసగా 125 మీ/ని మరియు 100 మీ/ని వేగాలతో నడుస్తున్నారు . ఒకేసారి ఒకే బిందువు నుండి ఒకే దిశలో వారిద్దరూ నడక ప్రారంభిస్తే, ఎంత సమయానికి వారిద్దరూ మొదటిసారి తిరిగి కలుస్తారు మరియు ఎంత సమయానికి మొదటిసారి ప్రారంభ బిందువు వద్ద తిరిగి కలుస్తారు ?

1) 60 నిమిషాలు & 80 నిమిషాలు     2) 80 నిమిషాలు & 100 నిమిషాలు

3) 80 నిమిషాలు & 80 నిమిషాలు     4) 60 నిమిషాలు & 100 నిమిషాలు

84) ఒక ఖాళీ తొట్టిని A అనే పైపు 4 గంటలలోనూ, B అనే పైపు 12 గంటలలోనూ మరియు C అనే పైపు 6 గంటలలోనూ నింపగలవు. క్రింది విధంగా అన్ని పైపుల తెరవబడ్డాయి. ఉదయం 6 గంటలకు పైపు C ని, ఉదయం 7 గంటలకు పైపు A ని మరియు ఉదయం 8 గంటలకు పైపు Bను తెరిచారు. ఉదయం 6 గంటలకు తొట్టి ఖాళీగా ఉన్నటైై తే తొట్టి ఏ సమయానికి నిండుతుందో ఆ సమయం 

1) ఉదయం 9     2) ఉదయం 8.45     3) ఉదయం 8.50     4) ఉదయం 9.10

85) 4 అంగుళాలు మరియు 5 అంగుళాల వ్యాసార్థాలు గల రెండు ఘన లోహగోళాలను రెండింటిని కలిపి ఒక గట్టి ఘనమును చేయడానికి కరిగించారు. ఘనాన్ని చేసే ప్రక్రియలో 63 ఘన అంగుళాల లోహం వృధా అయినట్లయితే, ఆ ఘనం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం (చదరపు అంగుళాలలో)

1) 792     2 729     3) 563     4) 486

86) A, B, C లు వరుసగా  1,25,000; 1,50,000; 2,00,000 రూపాయల పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 4 నెలల తరువాత A మరలా 75,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు. 

వ్యాపారాన్ని ప్రారంభించిన 6 నెలల తరువాత B మరియు C లు అదనంగా ౩: 2 నిష్పత్తిలో ఉన్న నిర్దిష్ట మొత్తాలను పెట్టుబడిగా పెట్టారు. వారు 1,20,000 రూపాయల వార్షిక పొందారు మరియు ఆ లాభంలో A వాటా 28,000 రూపాయలు. అయితే B అదనంగా పెట్టిన పెట్టుబడి సొమ్ము (రూపాయలలో)

1) 1,80,000    2) 2,70,000    3) 1,10,000    4) 1,50,000

87) A మరియు B లు తమ వ్యాపారాన్ని వరుసగా ₹16,000లు మరియు ₹x ల పెట్టుబడులతో ప్రారంభించారు. మూడు నెలల తర్వాత, A తన పెట్టుబడిని ₹5,000 లు ఉపసంహరించుకొంటే B ২₹6,000 లు పెట్టబడికి చేర్చాడు.  సంవత్సరాంతంలో, మొత్తం లాభంలో A మరియు B ల వాటాల భేదం మొత్తం లాభంలో A యొక్కవాటాకు సమానం అయితే, అపుడు x =

1) 12,400     2) 13,000     3) 20,000    4) 10,500

88) ప్రవాహం యొక్క వేగం గంటకు 5 కి.మీ.లు మరియు నిశ్చలమైన నీటిలో పడవ వేగం గంటకు 30 కి.మీ.లు A నుండి B కి ప్రవాహం వెంబడి ప్రయాణించడానికి ఆ పడవకు పట్టే సమయం, B నుండి C కి ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించడానికి అదే పడవకు పట్టే సమయానికన్నా 24 నిమిషాలు తక్కువ. A నుండి B కి గల దూరం, Bనుండి C కి గల దూరం కన్నా 4 కి.మీ.లు ఎక్కువైతే, B నుండి C కి గల దూరం (కి.మీ. లలో)

1) 42    2) 41    3) 45    4) 49

89) ఒక పాత్రలో పాలు మరియు నీటిని 5:3 నిష్పత్తిలో కలిపారు. తరువాత 16 లీటర్ల మిశ్రమాన్ని పక్కకు తీసి అంటే పరిమాణం గల  భర్తీ చేసారు. ఇప్పుడు కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి యొక్క ప్రస్తుత నిష్పత్తి 7:1. పాత్ర నుండి తిరగి 8 లీటర్ల మిశ్రమాన్ని పక్కకు తీస్తే, మిగిలిన మిశ్రమంలో గల పాల పరిమాణం

1) 14 లీటర్లు     2) 12 లీటర్లు     3) 10 లీటర్లు     4) 7 లీటర్లు

90) ఒక రైలు, గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఆ రైలు ప్రయాణించే దిశకు వ్యతిరేక దిశలో నడుస్తున్న వ్యక్తిని 15 సెకెండ్లలలో దాటుతుంది మరియు ఆ రైలు ప్రయాణిస్తున్న దిశలోనే గంటకు 8 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న మరొక వ్యక్తిని 18 సెకెండ్లలలో దాటుతుంది. అయితే గంటకు ఆ రైలు వేగం కిలోమీటర్లలో 

1) 78    2) 75     3) 80     4) 100

91) నిశ్చలమైన నీటిలో పడవ వేగం మరియు నీటి ప్రవాహ వేగాల నిష్పత్తి 5:1 ఆ పడవ 4 గంటలలో బిందువు A నుండి B కి వ్యతిరేక దిశలో ప్రయాణించిన దూరం, 4 గంటలలో B నుండి C కి నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా ప్రయాణించిన దూరం కంటే 24 రెట్లు ఎక్కువ. అయితే C నుండి B కి ప్రవాహ దిశలో ఆ పడవ ప్రయాణించడానికి పట్టే సమయం (గంటలలో)

1) \frac{8}{3}    2) \frac{9}{4}    3) \frac{6}{5}    4) \frac{7}{2}

92) 8 సెం.మీ. వ్యాసార్థం గల ఒక వృత్త కేంద్రం C. டACB  \left| \!{\nderline {\,
  {ACB} \,}} \right.  = \frac{\pi }{4} అయ్యేటట్లు ఆ వృత్తంపై A, B లు రెండు బిందువులు. వృత్తం నుండి చిన్న సెక్టార్‌ ACB ని తొలగించి మరియు మిగిలిన సెక్టార్‌తో ఒక గరిష్ట శంకువును తయారు చేశారు. అపుడు ఆ శంకువు ఘనపరిమాణం (ఘనపు సెం.మీ.లలో)

1) 154\sqrt {\frac{5}{3}}    2) \frac{1}{3}154\sqrt 5    3) \frac{1}{{\sqrt 3 }}154\sqrt {15}    4) 154\sqrt {15}

93) ఒక రాగి తీగను సమద్విబాహు బ్రిభుజాకారంగా వంచారు. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం  4356\sqrt 3 చ. సెం.మీ. మరియు అదే తీగను ఒక అర్థవృత్తాకార రూపంగా మార్చితే దాని వైశాల్యం (చదరపు సెం. మీ.లలో)

1) 176     2) 9317    3) 1331     4) 7545

94) లీపు సంవత్సరం అయినపుడు జనవరి నెల క్యాలండర్‌ అదే సంవత్సరంలో మరియొక నెల యొక్క క్యాలండర్‌తో ఖచ్చితంగా పోలి ఉ౦డి; లీపు సంవత్సరం కానపుడు, జనవరి నెల క్యాలండర్‌ అదే సంవత్సరంలో మరియొక నెల యొక్క క్యాలండర్‌తో ఖచ్చితంగా పోలి ఉంటే అప్తడు X, Y లు వరుసగా

1) జూలై, అక్టోబర్    2) ఏప్రిల్‌ నవంబర్‌    3) మార్చి, డిసెంబర్     4) మే, జులై 

95) కారు A యొక్క వేగం కారు B యొక్క వేగానికి  \frac{6}{5} రెట్లు. 3 గంటలలో 225 కి.మీ, దూరాన్ని కారు B వెళ్లగలిగితే, అదే దూరం వెళ్ళడానికి కారు A కి ఎంత సమయం పడుతుంది. 

1) 2గంటలు    2) 2 గంటల 30 నిమిషాలు    3) 2గంటల 15 నిమిషాలు     4) 2గంటల 45 నిమిషాలు

96) 1089 చ.యూ. వైశాల్యం గల ఒక చతురస్రం యొక్క చుట్టు కొలతకు ఒక వృత్త పరిధి సమానం. ఒక లంబ కోణ సమద్విబాహు త్రిభుజ యొక్క ఒక భుజం (దాని కర్ణం కాకుండా) యొక్క పొడవు దత్త వృత్తం యొక్క వ్యాసం పొడవుకు సమానమైతే, ఆ త్రిభుజం యొక్క వైశాల్యం (చదరపు యూనిట్లలో)

1) 882    2) \frac{{441}}{2}    3) 441    4) 363

97) ఒక గోడ గడియారం 12 గంటలలో 4 నిమిషాలను అదనంగా పొందుతుంది మరియు మరొక గోడ గడియారం 24 గంటలలో 2 నిమిషాలను కోల్పోతుంది. ఒక నిర్దిష్టమైన రోజు ఉదయం 8 గంటలకు రెండింటిలోనూ సమయాన్ని సరి చేసి పెట్టారు. తక్షణ భవిష్యత్తులో ఆ రెండు గడియారాలు ఖచ్చితంగా ఒకే సమయాన్ని చూపించడం ఎప్పుడు జరుగుతుందో ఆ సమయాన్ని ఎన్నుకోండి.

1) 84 రోజుల తర్వాత ఉదయం 10 గంటలకు

2) 60 రోజుల తర్వాత ఉదయం 9 గంటలకు

3) 72 రోజుల తర్వాత ఉదయం 8 గంటలకు

4) 75రోజుల తర్వాత రాత్రి 8 గంటలకు

98) ఒక దుకాణదారుడు ప్రతి వస్తువు పైనా ప్రకటిత వెలపై 20% తగ్గింపును అనుమతిస్తాడు మరియు ప్రతి వస్తువును విక్రయించడం ద్వారా 16% లాభాన్ని పొందుతాడు. అయితే ప్రతి వస్తువుపై కొన్నవెల కంటే ఎంత శాతం ఎక్కువగా ప్రకటిత వెల ఉంటుంది ?

1) 45%    2) 48%    3) 42%    4) 40%

99) 200 మీటర్ల పరుగు పందెంలో S ను 20 మీటర్ల తేడాతో A ఓడిస్తాడు. 250 మీటర్ల పరుగు పందెంలో Vని 10 మీటర్ల తేడాతో S ఓడిస్తాడు. 1000 మీటర్ల పరుగు పందెంలో, V ని ఎన్ని మీటర్ల తేడాతో A ఓడిస్తాడు ?

1) 125     2) 200     3) 216     4) 136

100) రెండు రైళ్లు X మరియు Y లు ఎదురెదురుగా ఒకే వేగంతో పరుగెడుతున్నాయి. రెండు రైళ్లు ఒకే పొడవు కలిగి ఉన్నాయి మరియు ఒక దానిని మరియొకటి 10 సెకండ్లలో దాటుతున్నాయి. రైలు X వేగం రెండింతలై,  రైలు Y వేగం మూడింతలైనప్పుడు అవి ఒకే దిశలో ప్రయాణిస్తే, అవి ఒకదానినొకటి దాటే సమయం (సెకండ్లలో)

1) 10     2) 12     3) 15    4) 20

TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 101 to 150)

TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 151 to 200)

TS SI Final Exam 2023 Official Answer Key (https://www.tslprb.in/)

TS Police Exams Previous Question Papers

Post a Comment

0Comments

Post a Comment (0)