TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 151 to 200)

TSStudies
0
TSLPRB SI Final Exam Question Paper with Key

TS SI Final Exam Question Paper With Key 2023

TS SI Arithmetic and Reasoning & Mental Ability Exam 2023

TSLPRB Police SI Preliminary Exam Date - 7 August 2022.

TSLPRB Police SI Final Written Exam Date - 8 April 2023. (Arithmetic & Reasoning)

తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (TSLPRB) SI, ASI ఫైన‌ల్ రాత‌ప‌రీక్షలో భాగంగా ఏఫ్రిల్ 8వ తేదీ ఉద‌యం 10:00 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:00 గంట‌ వరకు Arithmetic and Test of Reasoning / Mental Ability ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. 

Booklet Code A

TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 1 to 50)

TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 51 to 100)

TS SI Final Exam 2023 Question Paper with Key (Questions from 101 to 150)

151) దిగువన ఒక ప్రవచనం, దాని వెంబడి I మరియు  II అనే రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఈ  తీర్మానాలు ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే తీర్మానాలు కావచ్చు లేదా ప్రవచనం నుండి వచ్చిన తీర్మానాలు కాకపోవచ్చు. ఏ తీర్మానాలు     ప్రవచనాన్ని అనుసరిస్తాయో నిర్ణయించండి.

ప్రవచనం : ప్రజలు కష్టపడి పని చేస్తే ఆర్థిక పురోగతి సాధించవచ్చు.

తీర్మానాలు ;

I. ఆర్థిక పురోగతి ప్రజలు కష్టపడి పని చేయడానికి దారి తీస్తుంది.

II. ప్రజలు అందరినీ కష్టపడి పని చేసేటట్లు చేయడం అసాధ్యం.

1) I మాత్రమే  అనుసరిస్తుంది     2) II మాత్రమే అనుసరిస్తుంది

3) I మరియు II లు రెండూ అనుసరిస్తాయి      4) I కానీ లేదా II కాని ఏదీ అనుసరించదు

152) దిగువన ఒక ప్రవచనం, దాని వెంబడి I మరియు  II అనే రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఈ  తీర్మానాలు ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే తీర్మానాలు కావచ్చు లేదా ప్రవచనం నుండి వచ్చిన తీర్మానాలు కాకపోవచ్చు. ఏ తీర్మానాలు     ప్రవచనాన్ని అనుసరిస్తాయో నిర్ణయించండి.

ప్రవచనం : మతాన్ని సామాన్యులు సత్యం గాను, జ్ఞానులు అసత్యంగాను, పాలకులు ఉపయోగకరమైనదిగాను భావిస్తారు. 

తీర్మానాలు :

I. సామాన్యులకు మతంపై చాలా విశ్వాసం ఉంటుంది.

II.  పాలకులు ప్రజలను పాలించడానికి మతాన్ని ఉపయోగించుకుంటారు.

1) I మాత్రమే  అనుసరిస్తుంది     2) II మాత్రమే అనుసరిస్తుంది

3) I మరియు II లు రెండూ అనుసరిస్తాయి      4) I కానీ లేదా II కాని ఏదీ అనుసరించదు

153) ఈ దిగువున నిజమని భావించవలసిన ఒక ప్రవచనము వెంబడి రెండు భావనలు ఇవ్వబడ్డాయి. దత్త భావనలో ఏది (ఏవి) ప్రవచనంలో దాగినదో (దాగినవో) నిర్ణయించండి. 

ప్రవచనం : Q తో P ఇలా అన్నాడు. నీవు రిఫ్రిజిరేటర్‌ కొనదలుచుకుంటే, X బ్రాండ్‌దే కొనుగోలు చేయి.
భావనలు :
I. Q ఒక రిఫ్రిజిరేటర్‌ను కొనాలనుకుంటున్నారు.

II. X బ్రాండ్‌ రిఫ్రిజిరేటర్‌లు మంచివి.

1) I మాత్రమే ఇమిడి ఉంది        2) I Iమాత్రమే ఇమిడి ఉంది

3) I మరియు II లు రెండూ ఇమిడి ఉన్నాయి     4) I కానీ లేదా II కాని ఏదీ ఇమిడి లేదు

154. సూచనలు : ఈ ప్రశ్న దిగువన ఇచ్చిన రెండు ప్రవచనాలలో ఉన్న సమాచారం ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి తగినవో కాదో నిర్ణయించండి.
మీ ఐచ్చికాన్ని గుర్తించండి.
కేవలం ప్రవచనం I లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్చికం (1) అనీ;
కేవలం ప్రవచనం II లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్చికం (2) అనీ;
ప్రవచనం I & II లోని సమాచారం కలిసి ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్చికం (3) అనీ;
ప్రవచనం I & II లోని సమాచారం కలిసినా ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినది కాకపోతే ఐచ్చికం (4) అనీ;
ప్రశ్న: E తో C కి ఏ విధమైన బంధుత్వముంది ?
ప్రవచనాలు :
I. B మరియు C లకు A తల్లి,
II. D యొక్క తండ్రి. B మరియు E యొక్క సోదరి D

155) ఈ దిగువన నిజమని భావించవలసిన ఒక ప్రవచనము దాని వెంబడి రెండు భావనలు ఇవ్వబడ్దాయి. దత్త భావనాల్లో ఏది (ఏవి) ప్రవచనంలో దాగినదో (దాగినవో) నిర్ణయించండి. 

ప్రవచనం : A ఆమె భర్తతో ఇలా చెప్పింది. “పండగకు నీ సోదరున్ని ఎందుకు ఆహ్వానించకూడదు"?

భావనలు :
I. A యొక్క భర్త యొక్క సోదరుడు, ఆహ్వానిస్తే కానీ పండగలో పాల్గొనడు.
II. A యొక్క భర్త యొక్క సోదరుని రాక పండుగకు చాలా అవసరం.
1) I మాత్రమే ఇమిడి ఉంది     2) IIమాత్రమే ఇమిడి ఉంది
3) I మరియు II లు రెండూ ఇమిడి ఉన్నాయి.     4) I కానీ లేదా II కాని ఏదీ ఇమిడి లేదు

156) సూచనలు : ఈ ప్రశ్న దిగువన ఇచ్చిన రెండు ప్రవచనాలలో ఉన్న సమాచారం ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి తగినవో కాదో నిర్ణయించండి.

మీ ఐచ్చికాన్ని గుర్తించండి.
కేవలం ప్రవచనం I లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్చికం (1) అనీ;
కేవలం ప్రవచనం II లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్చికం (2) అనీ;
ప్రవచనం I & II లోని సమాచారం కలిసి ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్చికం (3) అనీ;
ప్రవచనం I & II లోని సమాచారం కలిసినా ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినది కాకపోతే ఐచ్చికం (4) అనీ;

ప్రశ్న : A యొక్క వయస్సు ఎంత ?

ప్రవచనాలు :
I. A వయన్సు B వయన్సుకు రెండు రెట్లు మరియు C వయస్సు B వయస్సుకు 4 రెట్లు

II. D వయన్సు 60 సంవత్సరాలు మరియు C వయస్సుకు 3/2 రెట్లు

157) దిగువన ఒక ప్రవచనం, దాని వెంబడి I మరియు  II అనే రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఈ  తీర్మానాలు ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే తీర్మానాలు కావచ్చు లేదా ప్రవచనం నుండి వచ్చిన తీర్మానాలు కాకపోవచ్చు. ఏ తీర్మానాలు     ప్రవచనాన్ని అనుసరిస్తాయో నిర్ణయించండి.

ప్రశ్న : ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఉన్న సాధారణ సమస్య చిన్న పిల్లల స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం.

ప్రవచనాలు :

I. తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగులు చూసుకోలేనంత బిజీగా ఉంటున్నారు.

II. పిల్లలు బహిరంగ క్రీడలు ఆడటానికి ఇష్టపడటం లేదు.

1) I మాత్రమే  అనుసరిస్తుంది     2) II మాత్రమే అనుసరిస్తుంది

3) I మరియు II లు రెండూ అనుసరిస్తాయి      4) I కానీ లేదా II కాని ఏదీ అనుసరించదు

158) సూచనలు : ఈ ప్రశ్న దిగువన ఇచ్చిన రెండు ప్రవచనాలలో ఉన్న సమాచారం ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి తగినవో కాదో నిర్ణయించండి.

మీ ఐచ్చికాన్ని గుర్తించండి.
కేవలం ప్రవచనం I లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్చికం (1) అనీ;
కేవలం ప్రవచనం II లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్చికం (2) అనీ;
ప్రవచనం I & II లోని సమాచారం కలిసి ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్చికం (3) అనీ;
ప్రవచనం I & II లోని సమాచారం కలిసినా ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినది కాకపోతే ఐచ్చికం (4) అనీ;

ప్రశ్న : అనితకు ఎంత మంది కుమారులు ?

ప్రవచనాలు :

I. Y కు సోదరుడు అయిన X కు తల్లి అనిత 

II. అనిత కూతురు నీలిమ ఇద్దరు సోదరులను మాత్రమే కలిగి ఉంది.

159) ఈ దిగువన నిజమని భావించవలసిన ఒక ప్రవచనము దాని వెంబడి రెండు భావనలు ఇవ్వబడ్దాయి. దత్త భావనాల్లో ఏది (ఏవి) ప్రవచనంలో దాగినదో (దాగినవో) నిర్ణయించండి. 

ప్రవచనం : ఒక కంపెనీ తమ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో బోనస్‌ ప్రకటించింది. 

భావనలు :

I. చాలా మంది ఉద్యోగులు కంపెనీని విడిచి వెళ్లరు.
II. ఉద్యోగులు మునుపటి కంటే ఎక్కువ సమర్థవంతంగా పని చేస్తారు.

1) I మాత్రమే ఇమిడి ఉంది     2) IIమాత్రమే ఇమిడి ఉంది
3) I మరియు II లు రెండూ ఇమిడి ఉన్నాయి.     4) I కానీ లేదా II కాని ఏదీ ఇమిడి లేదు


160) సూచనలు : ఈ ప్రశ్న దిగువన ఇచ్చిన రెండు ప్రవచనాలలో ఉన్న సమాచారం ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి తగినవో కాదో నిర్ణయించండి.
మీ ఐచ్చికాన్ని గుర్తించండి.
కేవలం ప్రవచనం I లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్చికం (1) అనీ;
కేవలం ప్రవచనం II లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్చికం (2) అనీ;
ప్రవచనం I & II లోని సమాచారం కలిసి ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్చికం (3) అనీ;
ప్రవచనం I & II లోని సమాచారం కలిసినా ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినది కాకపోతే ఐచ్చికం (4) అనీ;
ప్రశ్న: ఉత్తర దిక్కును చూస్తున్న బాలికల వరుసలో ఎంతమంది బాలికలు ఉన్నారు ?
ప్రవచనాలు: 
I. ఎడమ చివర నుండి 3వ స్థానంలోనూ, హేమ నుండి ఎడమ వైపున 3వ స్థానంలోనూ రాధ ఉంది.
II. కుడి చివర నుండి 5 వ స్థానంలోనూ,  హేమకు కుడి వైపున 3వ స్థానంలోనూ రేణుక ఉంది.

161) ఈ దిగువన నిజమని భావించవలసిన ఒక ప్రవచనము దాని వెంబడి రెండు భావనలు ఇవ్వబడ్దాయి. దత్త భావనాల్లో ఏది (ఏవి) ప్రవచనంలో దాగినదో (దాగినవో) నిర్ణయించండి. 
ప్రవచనం : నేటి పాఠకుడే రేపటి నాయకుడు.
భావనలు :
I. పుస్తకాలు చదవని వారు నాయకులు కాలేరు.
II. ఇతరుల నుండి నేర్చుకోకుండా ఎవ్వరూ నాయకుడు కాలేరు మరియు దీని కోసమై పఠించడం అవసరం. 
1) I మాత్రమే ఇమిడి ఉంది     2) IIమాత్రమే ఇమిడి ఉంది
3) I మరియు II లు రెండూ ఇమిడి ఉన్నాయి.     4) I కానీ లేదా II కాని ఏదీ ఇమిడి లేదు

162) దిగువన ఒక ప్రవచనం, దాని వెంబడి I మరియు II అనే రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఈ తీర్మానాలు ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే తీర్మానాలు కావచ్చు లేదా ప్రవచనం నుండి వచ్చిన తీర్మానాలు కాకపోవచ్చు. ఏ తీర్మానాలు ప్రవచనాన్ని అనుసరిస్తాయో నిర్ణయించండి.
ప్రవచనం : ఎక్కువ పని వారికి ఒత్తిడికి విరుగుడు అని చెప్తారు.
తీర్మానాలు :
I. కొంత మంది పేరు గడించిన వారికి ఎక్కువ పని ఒత్తిడి ఉంది.
II. పని, ఒత్తిడికి దారి తీస్తుంది.
1) I మాత్రమే  అనుసరిస్తుంది     2) II మాత్రమే అనుసరిస్తుంది
3) I మరియు II లు రెండూ అనుసరిస్తాయి      4) I కానీ లేదా II కాని ఏదీ అనుసరించదు

నిర్దేశికాలు (ప్రశ్న 163 మరియు 164) : 
క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు క్రింద యివ్వబడిన ప్రశ్నలకు  సమాధానమివ్వండి.
ఒక కంపెనీలో ప్రొబేషనరీ సీనియర్ క్లర్క్ ను ఎంపిక చేసుకోవడానికి నిబంధనలు క్రింద ఉన్నాయి. (i) స్క్రీనింగ్ టెస్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి.

(ii) కనీసం 60శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ కలిగి ఉండాలి.

(iii) మైక్రోసాఫ్ట్‌ ఆఫీసులో కంప్యూటర్‌ కోర్సు సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.

(iv) 1.6.2022 నాటికి 28 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి.

(v) S.S.C లో క్రనీసం 55% మార్కులు పొంది ఉండాలి

ఒకవేళ అభ్యర్థి :

(a) పైనున్న (i) ని నెరవేర్చలేక పోయి ఉండి, కనీసం 70% మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు స్క్రీనింగ్ టెస్ట్ లో కనీసం 45% మార్కులు పొంది ఉంటె, జూనియర్‌ క్లర్క్ గా నియమిస్తారు. 

(b) పైనున్న (ii )ను నెరవేర్చలేక పోయి ఉండి, ఒక కంపెనీ లో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం మరియు కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పొంది ఉంటే, హైడ్‌  క్లర్క్ గా నియమిస్తారు.

163)  Mr. X, 1994 ఆగస్టు 4 వ తేదీన జన్మించాడు మరియు  మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్ కోర్సు పూర్తి చేసాడు. ఆటను స్క్రీనింగ్ టెస్ట్ లో 60% మరియు S.S.C లో 62% పొందాడు.  అతను తన గ్రాడ్యుయేట్‌ డిగ్రీని 56% మార్కులతో పూర్తి చేసాడు. ఒక కంపెనీలో క్లర్క్ గా 11 నెలలు పనిచేసాడు. అయితే Mr. X, ను 

1) సీనియర్  క్లర్క్ గా నియమించవచ్చును 
2) జూనియర్‌ క్లర్క్ గా నియమించవచ్చును 
3) హెడ్  క్లర్క్ గా నియమించవచ్చును 
4) నియామకానికి అర్హుడు కాదు 

164) Mr. Y, 1995 మే 3వ తేదీన జన్మించాడు. అతను గ్రాడ్యూయేట్‌ డిగ్రీలో 71% మరియు  S.S.C లో 58% పొందాడు. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో అతనికి 46% వచ్చింది. అయితే Mr. Y, ని

1) సీనియర్  క్లర్క్ గా నియమించవచ్చును     2) జూనియర్‌ క్లర్క్ గా నియమించవచ్చును 

3) హెడ్  క్లర్క్ గా నియమించవచ్చును             4) నియామకానికి అర్హుడు కాదు 

165) నిశ్చితత్వం (A) : భుజాల పొడవులు 5, 7, 10 యూనిట్లుగా గల త్రిభుజము యొక్క వైశాల్యం  \sqrt {66}చదరపు యూనిట్లు.

కారణం (R): ఒక త్రిభుజం యొక్క భూమి 'b' మరియు ఎత్తు 'h' అయితే దాని వైశాల్యం = \frac{1}{2}bhచదరపు యూనిట్లు.

1) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ
2) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ కాదు
3) (A) సత్యము కానీ  (R) అసత్యము
4) (A) అసత్యము కానీ  (R) సత్యము

166) ప్రవచనాలు : తెలుపుది ఏదీ నలుపు కాదు; నలుపుది ఏదీ ఎరుపు కాదు.

పై ప్రవచనాల నుండి తీసుకోగల నిర్ణయం ఏది ?

(1) కొన్ని తెలుపుని ఎరుపువి             (2) కొన్ని తెలుపువి ఎరుపువి కావు
(3) తెలుపుది ఏది ఎరుపు కాదు         (4) ఏ నిర్ణయం తీసుకోలేము

167) AZY, BYX, CXW, DWV, EVU, ____ , శ్రేణిని కొనసాగించే సరి అయిన ఐచ్చికాన్ని ఎన్నుకోండి. 

1) FWT    2) FIU    3) FUV    4) FUT

168) నిశ్చితత్వం (A) : ఒక లీపు సంవత్సరం కాని సంవత్సరంలో, జనవరి 1వ తేదీ డిసెంబర్‌ 31వ తేదీ వారంలోని ఒకే రోజున ఉంటాయి.

కారణం (R) : 52 వారాల తర్వాత 2 రోజులు ఒక లీపు సంవత్సరంలో ఉంటాయి.

1) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ

2) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ కాదు

3) (A) సత్యము కానీ  (R) అసత్యము

4) (A) అసత్యము కానీ  (R) సత్యము

169) A, B, C, D మరియు E లు వరుసగా ⊀, #, ⊁, >, <, = లను సూచిస్తున్నాయి. x, y, z లు ఏవైనా మూడు ధన వాస్తవ సంఖ్యలు. 4 y F 3 x మరియు 3 x F 6 z రెండు ప్రవచనాల భావము.

1) zE y; xDy    2) zD y;xEy    3) xF yFz    4) xF yBz

170) +, –, \div\times, =, > మరియు < లను వరుసగా ⋀, V, Δ, $, E, G మరియు L లు సూచిస్తే క్రింది వానిలో ఏది సత్వమ్లు ? 

1) 13⋀7V6Δ2L3$4    2) 1) 9⋀5⋀4E18Δ9⋀16    3)9 \vee 3 \vee 2 \wedge 1G8\$ 2    4) 28\Delta 4\$ 2L6\$ 4\Delta 2

171) నిశ్చితత్వం (A): ఒక నిమిష కాలంలో, గంటల ముల్లు కంటే, నిమిషాల ముల్లు  5{\frac{1}{2}^ \circ }  ముందు ఉంటుంది.

కారణం (R): ఒక గంట కాలంలో గంటల ముల్లు కంటే నిమిషాల ముల్లు 55 నిమిషాల ముందు ఉంటుంది మరియు నిమిషాల ముల్లు 1 నిమిషంలో చేసే కోణం {6^ \circ }

1) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ

2) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ కాదు

3) (A) సత్యము కానీ  (R) అసత్యము

4) (A) అసత్యము కానీ  (R) సత్యము

172) 132, 182, 306, 380, 552, 870, _____ , శ్రేణిని కొనసాగించే సరి అయిన ఐచ్చికాన్ని ఎన్నుకోండి. 

1) 1020    2) 1148    3) 947    4) 992

173) THERAPY ని GSVIZKB గా కోడ్ చేస్తే BIOGRAPHY యొక్క కోడ్ 

1) YRMTIZKSB    2) YRLTJZKSB    3) YRLSIZKTP    4) YRLTIZKSB

174) ఒక కళాశాలలో ప్రవేశం పొందడానికి ఉండే వివిధ చర్యల అనుక్రమంను సూచించే దత్తాంశ పరిణామ క్రమ పటమును క్రింద పరిశీలించండి.

ఒక విద్యార్థి సరియైన పత్రాలు అన్నింటినీ సమర్పిస్తే, అతనికి ప్రవేశము రాకపోవడానికి, తగిన కారణం

1) అతనికి కావలసిన బ్రాంచ్‌ లేదు     2) అతనికి ఒక సరియైన పత్రం లేదు

3)  ఫీజు చెల్లింపు రసీదు తీసుకోవడం మర్చిపోయాడు

4) ఫీజు చెల్లించి రసీదు తీసుకోవడం మర్చిపోయాడు

175) 1, 3, 6, 11, 18, ?, 42, 59 శ్రేణిలో కనిపించని పదం 

1) 26    2) 27    3) 29    4) 31

176) A, ,B, C మరియు D పురుషులలో కనీసం ఇద్దరితో మరియు P, Q, R, S అనే మహిళలలో కనీసం ఇద్దరితో ఒక కమీటీని 5 గురితో ఏర్పాటు చేయాలి. Q తో పాటు A లేదా C ఉండకూడదు. B తో పాటు P లేదా S ఉండకూడదు. Q, R లు కలిసి ఉండకూడదు. ఈ క్రింది వానిలో సాధ్యమయ్యే కమిటీలలో అనుకూలము అయినది

1) A, P, Q, R, C    2) A, B, D, P, R    3) B, C, Q, R, S    4) P, R, S, A, D

177) క్రింది సమాచారాన్ని చదివి ప్రశ్నకు సమాధానమివ్వండి.

i) A $ B అంటే A మరియు B లకు ఒకే వయస్సు ఉంటుంది

ii)  A * B అంటే B వయస్సు కంటే A వయస్సు తక్కువ

iii) A @ B అంటే B వయస్సు కంటే A వయస్సు ఎక్కువ

అయితే P * Q @ R $ S అంటే 

(1) అందరిలోకి P వయస్సు తక్కువ     (2) అందరిలోకి R వయస్సు తక్కువ

(3) అందరిలోకి Q వయస్సు ఎక్కువ     (4) అందరిలోకి S వయస్సు తక్కువ

178) ఒక కోడ్‌లో 'KNIFE' ను 5#%3$ గానూ, 'LAKE' ను @75$ గానూ మరియు 'FLANK' ను 3@7#5 గానూ వ్రాస్తే అదే భాషలో 'LIFE IN FAIL' యొక్క కోడ్‌.

1) @%3$%#37%@    2) 73%$#%73%7    3) 5%3$%#@#%5    4) %53$#%#@5%

179) ఎడమ నుండి కుడికి తీసుకున్నపుడు రెండు వరుస అక్షరాల మధ్య ఉందే అక్షరాల సంఖ్య ప్రతిసారి 1 పెరిగేటట్లు ఉన్న అక్షర శ్రేణిని ఐచ్చికాల నుండి ఎన్నుకోండి.

1) O M K J G    2) O I G D C    3) O N L K J    4) O M J F A

180)  ప్రభావము : కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ శాఖలకు చాలా డిమాండ్‌ ఉంది.

క్రింది వానిలో పైన పేర్కొన్న ప్రభావానికి బలమైన కారణం ఏది ?

1) ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్‌ సిబ్బంది అవసరం దినదినానికి విపరీతంగా పెరుగుతోంది మరియు ఈ ఉద్యోగులకిస్తున్న పారితోషికాలు చాలా ఎక్కువగా ఉంటాయి

2) ఈ కోర్సులను పూర్తి చేయడం మరియు ఉద్యోగాలు సంపాదించడం చాలా సులభం

3) ఇంజినీరింగ్‌లోని ఇతర శాఖలు చాలా కష్టం

4) ఇతర ఇంజినీరింగ్‌ శాఖల నుండి పట్టభద్రులయిన వారికి ఉద్యోగావకాశాలు లేవు

181) క్రింది ప్రవచనం I, ప్రవచనం II లు ఇవ్వబడ్డాయి. ఈ ప్రవచనాలు కారణము మరియు ప్రభావం అనే సంబంధాన్ని కలిగి ఉండవచ్చు లేదా స్వతంత్ర కారణాలు కావచ్చు లేదా ఏదైనా కారణాలకు ప్రభావాలు కావచ్చు. 

I. ప్రధాన మంత్రి భద్రత ఇంకా కట్టుదిట్టం చేయబడింది.

II. రక్షణ దళం యొక్క నివాసితుల సంక్షేమ సంఘం భద్రత పెంచాలని నిర్ణయించి, నివాస ప్రాంతానికి మరిన్ని ఎక్కువ CCTV కెమెరాలు అమర్చారు.

పై ప్రవచనాల మధ్య గల సంబంధం.

1) I కారణం, II ప్రభావం

2) II ప్రభావం I కారణం

3) I మరియు II రెండూ స్వతంత్ర కారణాలకు ప్రభావాలు

4) I మరియు II రెండూ ఉమ్మడి కారణానికి ప్రభావాలు

182) క్రింద ఐచ్చికాలలో ఇచ్చిన ఏ సంజ్ఞల పరస్పర మార్చిడి క్రింద ఇచ్చిన సమీకరణాన్ని అర్ధవంతగా చేస్తుందో, అవి కలిగిన ఐచ్చికం ?

18 + 12 – 6 ☓ 4 ÷ 2 = 24

1) ÷&+    2) +&    3) –&☓    4) ÷&–

183) నిశ్చితత్వం (A) : పైకి కనిపించేవి అన్నీ మోసపూరితమైనవి.

కారణం (R): మెరిసేదంతా బంగారం కాదు.

1) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ

2) (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ కాదు

3) (A) సత్యము కానీ  (R) అసత్యము

4) (A) అసత్యము కానీ  (R) సత్యము

184) B F K K T V P  అనేది J E A L O U S యొక్క కోడ్‌. B F I Q O F U కోడ్‌ గా కలిగిన పదం. (ఆ పదానికి అర్థం ఉండనవసరం లేదు

1) H E A R T E N    2) J G C P V G P    3) A E H R N E T    4) C G J P P G V

185) ఒక స్త్రీ ని చూపిస్తూ A ఇలా అన్నాడు. “ఆమె నా తండ్రి యొక్క తల్లి యొక్క ఏకైక సంతానం యొక్క కొడుకు యొక్క సోదరి. ఆ స్త్రీ కి A యొక్క భార్యతో గల సంబంధం.

1) సోదరి     2) వదిన లేక మరదలు     3) తల్లి     4) అత్త 

186) A,B,C,J,M,N,P,R,S,Vలు ఒక కుటుంబంలోని 10 మంది సభ్యులు. A యొక్కతాత N P యొక్క కుమార్తె M. R యొక్కబావమరుదులు S,J,C లు. J యొక్కకుమారుడు B. C యొక్క తల్లి V. N యొక్క అల్లుడు R. N యొక్క సోదరి A. B యొక్క మేనత్త P అయితే క్రింది వానిలో ఏది అసత్యము ?

1) M యొక్కతండ్రి R                 2) Aయొక్క మేనమామ J     
3) P యొక్క మేనల్లుడు B          4) R యొక్క మేనకోడలు A

187) A, B, C, D, E లు  ఐదుమందివిద్యార్థులు.  P, Q, R, S, T లు ఐదుమంది రచయితలు. వీరిలో ప్రతి ఒక్కరూ గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం మరియు జంతుశాస్త్రం అనే పాఠ్యాంశాలపై (అదే క్రమంలో కాకపోవచ్చు) ఒక్కొక్కరూ ఒకే పుస్తకాన్ని రచించారు. ప్రతి విద్యార్థి కేవలం ఒకే ఒక పుస్తకాన్ని సొంతంగా కలిగి ఉంటాడు. Rరసాయనశాస్త్రం రచయిత; ఈ పుస్తకం B లేదా E ల సొంతం కాదు. గణితశాత్రం పుస్తకం A సొంతం. T చే రచింపబడిన పుస్తకం B సొంతం; కానీ భౌతికశాస్త్రం కాదు. P చే రచింపబడిన జంతుశాస్త్రం పుస్తకం D సొంతం. భౌతికశాస్త్రం పుస్తకాన్ని S రచించలేదు. అయితే భౌతికశాస్త్రం పుస్తకం
1) S చే రచింపబడింది మరియు C సొంతం 
2) Q చే రచింపబడింది మరియు C సొంతం
3) P చే రచింపబడింది మరియు E సొంతం 
4) Q చే రచింపబడింది మరియు E సొంతం

188) ఒక వస్తువు X యొక్క అయిదు బ్రాండ్ల పేర్లు A, B, C, D మరియు E. వస్తువు Y యొక్క మూడు బ్రాండ్ల పేర్లు P, Q, R. బ్రాండ్లు A, B, C, D, E లలో A బరువైనది మరియు P,Q,R లలో R తేలికైనది. Q మరియు D కంటే C ఖరీదు అయినది కానీ B కంటే చవకైనది. వస్తువు X యొక్క బ్రాండ్‌లలో A అన్నింటికంటే ఖరీదైనది కాదు. E కంటే D చవకైనది మరియు వీటి ఖరీదుల మధ్యలో X యొక్క ఏ బ్రాండ్‌ వస్తువు ఖరీదు లేదు. X యొక్క బ్రాండ్‌లలో మూడింటికంటే మరియు వస్తువు Y యొక్క అన్ని బ్రాండ్‌ల కంటే, E బరువైనది. R కంటే Q ఖరీదైనది కానీ Q కంటే బరువైన P కంటే చవకైనది. B మరియు C లు రెండూ D కంటే బరువు అయినవి అయితే, వస్తువు X యొక్క అన్ని బ్రాండ్లలో తెలికైనది.
1) B        2) C        3) D        4) E

189) G119Q, K253W, M39C, Q153I, ______ శ్రేణిని కొనసాగించే సరియైన ఐచ్చికాన్ని ఎన్నుకోండి.
1) B45W    2 )C56S    3) G90M    4) S2850

190) ఒక నిర్షిష కోడ్‌ భాషలో 'CUB' ను '7@4' గానూ, 'RELATION' ను '1*5$3#&9' గానూ మరియు CELEBRATION ను 7*5*41$3#&9 గానూ వ్రాస్తే అదే భాషలో 'AUTOCRAT' ను వ్రాస్తే వచ్చేది.
(1) $@5&71$5     2) $#3&71$3    3) $&3@71$3     4) $@3&71$3

191) C 6 Q 3 $ F J © E N 7 R % 9 K X 2 G H V 4 * 8 T I # U A
ఎడమ నుండి 5వ మూలకాన్ని మరియు కుడి నుండి 4వ మూలకాన్ని ఒక దాని స్థానంలో మరొక దానిని మార్చితే, ఒక సంఖ్య తరువాత వెంటనే వచ్చే హల్లుల సంఖ్య
1) 5    2) 4    3) 6    4) 7

192) కొన్ని అక్షరాలకు కోడ్‌లు క్రింద పట్టికలో ఇవ్వబడినవి. పట్టికలో లేని అక్షరానికి కోడ్‌ ఆ అక్షరమే.
ఒక పదం యొక్క కోడ్‌ రాబట్టడానికి దాని లోని అక్షరాలకు బదులు వాటి కోడ్‌లు వ్రాస్తూ పాటించవలసిన నియమాలు
a) ఒక పదం యొక్క కొన అక్షరాలు రెండూ అచ్చులు అయితే, వాటికి, వాటి తర్వాత వెంటనే వచ్చే హల్లుల యొక్క కోడ్‌ వ్రాయండి.
b) ఒక పదంలో మొదటి అక్షరం హల్లు, చివరి అక్షరం అచ్చు అయితే, వాటి కోడ్‌లను పరస్పరం మార్చండి.
c) ఒక పదంలో మొదటి అక్షరం అచ్చు, చివరి అక్షరం హల్లు అయితే, రెండూ ఆ హల్లు యొక్కకోడ్‌తో వ్రాయండి.
'DRAG' మరియు 'PRAVEDI' పదాల యొక్క కోడ్‌లు వరుసగా
1) 534%, ©3145$*     2) 543%, *341$5©    3) 534%, ©341$5*     4) %435, *5$143©

193) A, B, C, D, E మరియు F ఒక కుటుంబంలోని ఆరుగురు సభ్యులు. D కు భర్త అయిన B యొక్క తల్లి A. C యొక్క తల్లిదండ్రులలో ఒకరికి F సోదరుడు. E కు కోడలు సహోదరులు లేని D. D యొక్కకుమారుడు C. ఆ కుటుంబంలో ఉన్న పురుషులు మరియు స్త్రీల సంఖ్యలు వరుసగా
1) 3, 3     2) 4, 2    3) 2, 4     4) 5, 1

194) ఒక నిర్దిష్ట కోడ్‌లో
 ORDER NOW FOR PROFIT ను "oh aj ey ag" గా వ్రాయబడింది.
NOW RIGHT FOR HIM ను "ag aj ev es" గా వ్రాయబడింది.
FOR PROFIT PLACE ORDER ను "oh ey ib ag" గా వ్రాయబడింది.
IN RIGHT ORDER ONLY ను "ev hd ey oz" గా వ్రాయబడింది.
PLACE HIM ORDER యొక్క కోడ్‌
1) es ib ag    2) oz ev aj        3) es ey ib    4) oz ev ag

195) A, ,B, C లలో ఒకరు వైద్యుడు, ఒకరు ఉపాధ్యాయుడు మరియు ఒకరు ఇంజినీర్‌. D, ,E, F లు వారి భార్యలు (అదే వరుసలో కానవసరం లేదు). E ఇంజినీర్‌ను వివాహమాడింది. F యొక్క భర్త వైద్యుడు కాదు. B ఒక ఉపాధ్యాయుడు. C ని D వివాహ మాడింది కానీ అతను ఇంజినీర్‌ కాదు. అయితే
1) F యొక్క భర్త వైద్యుడు     2) E యొక్క భర్త C    3) B యొక్క భార్య E    4) C వైద్యుడు

196) ఆంగ్ల వర్ణమాలలోని Y మరియు Z తప్ప మిగిలిన అక్షరాలను 1, 2,3,4, 5, 6, 7, 8 అంకెలతో క్రింది విధంగా కోడ్‌ చేశారు.

అక్షరాలు

A,D,G

J,M,P

S,V,B

E,H,K

N,Q,T

W,C,F

I,L,O

R,U,X

అంకెలు

8

7

6

5

4

3

2

1

ఈ కోడ్‌ తో 'BILL'ను '6222 గా కోడ్‌ చేస్తే 'SUBJECT OF THE COURSE' అనే వాక్యం యొక్క కోడ్‌
1) 6168534 23 455 322165     2) 6167634 23 4155 321166
3) 6167534 23 455 321165     4) 6116534 23 4155 321165

197) క్రింది అక్షర శ్రేణిలో ప్రశ్న గుర్తు (?) ఉన్న స్థానంలో ఏది రావాలి
BYDW, CXFU, EVJQ, GTNM, ?
1) HSPK    2) KPVE    3) JQTG    4) TRRJ

198) క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి, క్రింది ప్రశ్నకు సమాధానమివ్వండి.
1) A * B అంటే B యొక్క మేనల్లుడు A
2) A @ B అంటే B యొక్క తల్లి A
3) A & B అంటే B యొక్క తాత A
4) A $ B అంటే Bయొక్క భర్త A
5) A # B అంటే B యొక్క తండ్రి A
U ఒక పురుష సభ్యుదైతే క్రింది సంబంధాలలో P & Q $ R @ S T # U అనే సమాసం ద్వారా ఏది సత్యమో కనుక్కోండి.
1) T # R    2) U * Q  3) R @ U    4) S $ U

199)  ఒక నిర్దిష్ట కోడ్‌లో, VERBAL ను 22-22-18-25-1-15 గానూ REASON ను 18-22-1-8-15-13 గానూ కోడ్‌ చేశారు అయితే CUBOID యొక్క కోడ్‌
1) 3-6-2-12-9-23    2) 24-6-25-12-18-4    3) 3-21-2-15-9-4    4) 24-6-25-12-18-23

200) 200. BY2, CX3, EV5, GT7, ____ ,  శ్రేణిని కొనసాగించే సరి అయిన ఐచ్చికాన్ని ఎన్నుకోండి.
1) JS8    2) KP11    3) DW4    4) MN12


TS SI Final Exam 2023 Official Answer Key (https://www.tslprb.in/)

TS Police Exams Previous Question Papers

Post a Comment

0Comments

Post a Comment (0)